News July 13, 2024
బ్లాక్ బస్టర్ ‘కల్కి’పై బాలీవుడ్ డైరెక్టర్ ప్రశంసలు!
ప్రభాస్ నటించిన ‘కల్కి’ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలవడంపై బాలీవుడ్ డైరెక్టర్ కునాల్ కోహ్లీ మేకర్స్‌ను అభినందించారు. కొందరు కావాలనే ‘కల్కి’పై నెగటివిటీ సృష్టిస్తున్నారని ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు కునాల్ స్పందించారు. ‘ఫేక్ PR, పెయిడ్ రివ్యూస్, ఇన్‌ప్లూయెన్సర్ ప్రమోషన్స్ లేకుండానే కల్కి బ్లాక్ బస్టర్ అయింది. ఈ విజయాన్ని సినీ పరిశ్రమ తప్పకుండా సెలబ్రేట్ చేసుకోవాలి& నేర్చుకోవాలి’ అని ట్వీట్ చేశారు.
Similar News
News October 31, 2024
వేద పండితులకు రూ.3,000.. ఉత్తర్వులు జారీ
AP: రాష్ట్రంలోని వేద పండితులకు నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 600 మందికి సింహాచలం, అన్నవరం, కనకదుర్గ, శ్రీకాళహస్తి, ద్వారకాతిరుమల, శ్రీశైలం, కాణిపాకం ఆలయాల నుంచి సంభావన చెల్లించాలని పేర్కొంది. ఈ సాయం పొందే పండితులు వారి నివాసానికి సమీపంలోని ఆలయంలో రోజూ గంటపాటు వేద పారాయణం చేయాలంది.
News October 31, 2024
ఈ ఆలయం దీపావళి రోజు మాత్రమే తెరుస్తారు
కర్ణాటకలోని హసన్ పట్టణంలో ఉన్న హసనాంబా ఆలయంలో దుర్గాదేవి హసనాంబాదేవిగా పూజలందుకుంటారు. ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా మాత్రమే ఈ ఆలయం తెరుస్తారు. దీపావళి రోజు ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. అవి పదిరోజుల పాటు కొనసాగుతాయి. ఉత్సవాల సమయంలో అమ్మవారిని దర్శించుకుంటే కోర్కెలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు. మీ ప్రాంతంలో ఇలాంటి ఆలయాలు ఉన్నాయా? కామెంట్ చేయండి.
News October 31, 2024
మాజీ మంత్రి అప్పలరాజుకు తీవ్ర అస్వస్థత
AP: మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న పలాసలోని ఇంటి వద్ద వ్యాయామం చేస్తుండగా కుప్పకూలారు. వెంటనే కుటుంబసభ్యులు శ్రీకాకుళంలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.