News July 13, 2024
టాస్ గెలిచిన భారత్.. టీమ్‌లోకి కొత్త ప్లేయర్
జింబాబ్వేతో జరుగుతున్న నాలుగో టీ20లో టీమ్ ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో తుషార్ దేశ్‌పాండే అరంగేట్రం చేస్తున్నారు. భారత్: జైస్వాల్, గిల్(సి), అభిషేక్, రుతురాజ్, సంజు శాంసన్, రింకు సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఖలీల్, తుషార్ దేశ్‌పాండే. జింబాబ్వే: మాధెవెరె, మారుమణి, బెన్నెట్, మయర్స్, రజా(సి), కాంప్‌బెల్, మదాండే, ముజరబానీ, చటారా, నగరవ, ఫరాజ్ అక్రమ్
Similar News
News January 20, 2025
రైతు ఆత్మహత్యలపై BRS అధ్యయన కమిటీ
TG: రైతు ఆత్మహత్యలపై అధ్యయనానికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసినట్లు BRS ప్రకటించింది. ఈ కమిటీ సభ్యులు 2 వారాల పాటు అన్ని జిల్లాల్లో పర్యటించి రైతు ఆత్మహత్యలు, వ్యవసాయ రంగ పరిస్థితులపై అధ్యయనం చేస్తారని తెలిపింది. అధ్యయనం అనంతరం నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తామని, బడ్జెట్ సమావేశాల్లో రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని KTR పేర్కొన్నారు.
News January 20, 2025
జూన్ నుంచి ‘కల్కి-2’ షూటింగ్: అశ్వనీ దత్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్న ‘కల్కి-2’ సినిమాపై నిర్మాత అశ్వనీ దత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘ప్రభాస్ కోసం వెయిట్ చేశాను. కాల్ షీట్స్ ఇవ్వడంతో కల్కి తీశాను. జూన్ నెల నుంచి కల్కి-2 సినిమా షూటింగ్ మొదలు కానుంది. వచ్చే ఏడాది విడుదలకు ప్లాన్ చేస్తున్నాం’ అని తెలిపారు. దీంతో ప్రభాస్ ఒకేసారి ఫౌజీ, కల్కి-2, స్పిరిట్ సినిమాలు చేయనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి.
News January 20, 2025
‘డాకు మహారాజ్’ కలెక్షన్లు ఎంతంటే?
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కించిన ‘డాకు మహారాజ్’ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రిలీజైన 8 రోజుల్లోనే రూ.156+ కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. అటు నార్త్ అమెరికాలోనూ భారీగా వసూళ్లు రాబడుతుండటం విశేషం. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించగా నాగవంశీ నిర్మించారు.