News July 13, 2024
స్టాఫ్ నర్స్ నిర్లక్ష్యం.. పురిటిలో శిశువు మృతి

స్టాఫ్ నర్స్ నిర్లక్ష్యంతో ఓ గర్భిణి పురిటిలో శిశుమృతి చెందిన ఘటన శనివారం తల్లాడ మండలంలో జరిగింది. మల్లారంకి చెందిన గర్భిణి లావణ్యకు పురిటి నొప్పులు రావడంతో శుక్రవారం PHCకి భర్త తీసుకెళ్లాడు. వైద్యాధికారి అందుబాటులో లేకపోవడంతో స్టాఫ్ నర్స్‌ను డెలివరీ చేయాలని భర్త కోరారు. దీంతో నర్సు సెల్ ఫోన్‌లో రీల్స్ చూస్తూ నిర్లక్ష్యం వహించింది. శిశువు కడుపులో ఉమ్మ నీరుతాగి మరణించింది.
Similar News
News September 19, 2025
సీతారామ ప్రాజెక్ట్ భూ సేకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి: కలెక్టర్

ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శుక్రవారం సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్ట్‌లో భూ సేకరణ, అటవీ సమస్యలు ఆలస్యానికి కారణమని అధికారులు పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న భూముల బదలాయింపు, అవార్డులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. డిస్ట్రిబ్యూటరీ కాల్వల సర్వే 20 రోజుల్లో పూర్తిచేయాలని సూచించారు.
News September 19, 2025
ఖమ్మం: సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రారంభించిన కలెక్టర్

రాపర్తి నగర్‌లోని TGMRJC బాలికల జూనియర్ కళాశాలలో నిట్, ఐఐటీ ఆశావహ విద్యార్థినుల కోసం ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రారంభించారు. లైబ్రరీ, తరగతి గదులను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థినులు, తల్లిదండ్రులతో ఆత్మీయంగా మాట్లాడి తన అనుభవాలను పంచుకున్నారు. ఇంటర్‌లో కృషి చేస్తే మంచి కెరీర్ సాధ్యమని, పోటీ పరీక్షల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
News September 18, 2025
ఖమ్మం: ‘పదవి ముగిసిన.. బాధ్యతలకు ముగింపు లేదు’

సర్పంచ్ పదవి కాలం ముగిసి 20 నెలలు కావొస్తున్న.. రఘునాథపాలెం మండలంలోని బూడిదంపాడు గ్రామ మాజీ సర్పంచ్ షేక్ మీరా సాహెబ్ మాత్రం తన వంతు బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉన్నారు. అనునిత్యం ప్రజల మధ్యలోనే ఉంటూ అనేక పనులు చేయిస్తూ తన వంతు కృషి చేస్తున్నారు. వీధులను శుభ్రం చేయించడం, బ్లీచింగ్ చల్లించడం, పరిసర ప్రాంతాల్లో పిచ్చి మొక్కల నివారణకు కలుపు మందు పిచికారి చేయించడం వంటి ఎన్నో పనులు చేపిస్తూ ఉన్నారు.