News July 13, 2024

2,000 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు

image

మొనాకోలో జరుగుతున్న డైమండ్ లీగ్‌లో ఆస్ట్రేలియా రన్నర్ జెస్సికా హల్ ప్రపంచ రికార్డు సృష్టించారు. మహిళల విభాగంలో 2,000 మీటర్ల పరుగును 5 నిమిషాల 19.70 సెకన్లలోనే పూర్తి చేశారు. 2021లో బురుండికి చెందిన ఫ్రాన్సిస్ 5:21.56 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకోగా, ఇవాళ ఆ రికార్డు బ్రేకయ్యింది. తన పేరు చరిత్రపుటల్లో ఎక్కిందని, ఈ అనుభూతి అద్భుతంగా ఉందని జెస్సికా తెలిపారు.

Similar News

News November 10, 2025

శంకరుడి దశావతారాలు మీకు తెలుసా?

image

1. మహాకాలుడు – మహాకాళి,
2. తార్ – తార,
3. బాలభువనేశుడు – బాలభువనేశ్వరి,
4. షోడశశ్రీవిద్యేశుడు – షోడశశ్రీవిద్యేశ్వరి,
5. భైరవుడు – భైరవి,
6. చిన్న మస్తకుడు – చిన్న మస్తకి,
7. ధూమవంతుడు – ధూమవతి,
8. బగలాముఖుడు – బగళాముఖి,
9. మాతంగుడు – మాతంగి, 10. కమలుడు – కమల.

News November 10, 2025

శివయ్యను ఎలా పూజిస్తే సంతోషిస్తాడు?

image

శివుడికి కొన్ని పూలంటే చాలా ఇష్టం. మారేడు దళాలతో పూజిస్తే ఆయన వెంటనే అనుగ్రహిస్తాడట. శంఖం పూలు సమర్పిస్తే సంతోషపడతాడట. నాగమల్లి పూలతో పూజిస్తే పుణ్య కార్యాలు చేసిన ఫలితం ఉంటుందట. సంపెంగ పూలు పెడితే ప్రసన్నమవుతాడని, జిల్లేడు పూలు సమర్పిస్తే, పోయిన జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇలా ఇష్టమైన వాటితో ఆరాధిస్తే శివయ్య సంతోషించి, శుభాలు కలుగజేస్తాడని పండితులు చెబుతున్నారు.

News November 10, 2025

ఏపీ టుడే

image

* ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం. సీఐఐ సమ్మిట్, మొంథా తుఫాన్ ప్రభావంతో పంట నష్టాలపై అంచనాలు, పరిహారంపై చర్చకు అవకాశం. అమరావతి అభివృద్ధి కోసం రుణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపే ఛాన్స్.
* ఇవాళ, రేపు మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం రెండుగా విడిపోయి పర్యటన. నేడు బాపట్లలో టీమ్-1, కృష్ణా, ఏలూరు, తూర్పు గోదావరిలో టీమ్-2 పంట నష్టాలపై అంచనా వేయనున్నాయి.