News July 13, 2024
శాతవాహన యూనివర్సిటీకి రూ.100 కోట్లు కేటాయించాలి: ఏబీవీపీ

శాతవాహన యూనివర్సిటీకి రూ.100 కోట్లు కేటాయించాలని ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యుడు అంజన్న డిమాండ్ చేశారు. శనివారం కరీంనగర్‌లో ఆయన మాట్లాడుతూ.. శాతవాహన యూనివర్సిటీని గత, ప్రస్తుత ప్రభుత్వాలు పట్టించుకోకుండా వెనుకబాటుకు గురి చేస్తున్నాయన్నారు. మౌలిక వసతులు కల్పించలేకపోవడం సిగ్గు చేటన్నారు. శాతవాహన యూనివర్సిటీలోని కోర్సులను రెగ్యులరైజ్ చేయాలని, కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
Similar News
News January 19, 2026
హుస్నాబాద్: అదుపుతప్పిన బైక్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

హుస్నాబాద్ మండలం పూల్నాయక్ తండాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బర్మావత్ మనోహర్(27) బైక్ అదుపుతప్పి కరెంటు పోల్‌ను ఢీకొని మృతిచెందాడు. సంక్రాంతి సెలవుల్లో స్వగ్రామానికి వచ్చిన మనోహర్ హుస్నాబాద్-కరీంనగర్ మార్గంలో సబ్‌స్టేషన్ సమీపంలో సోమవారం ప్రమాదానికి గురయ్యాడు. 108 సిబ్బంది ఆయనను ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
News January 18, 2026
కరీంనగర్ జిల్లాలో వార్డుల రిజర్వేషన్లు పూర్తి

KNR జిల్లాలోని కరీంనగర్ కార్పొరేషన్ సహా జమ్మికుంట, హుజూరాబాద్, చొప్పదండి మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా రిజర్వేషన్లను శనివారం ఖరారు చేశారు. కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ పమేలా సత్పతి లాటరీ పద్ధతిన ఈ ప్రక్రియ నిర్వహించారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ కేటగిరీల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా వార్డులను కేటాయించినట్లు కలెక్టర్ వెల్లడించారు.
News January 17, 2026
కరీంనగర్ కార్పొరేషన్ రిజర్వేషన్లు ఖరారు

KNR కార్పొరేషన్ 66 వార్డుల రిజర్వేషన్ వివరాలు ఇలా ఉన్నాయి.
ఎస్టీ జనరల్: 28
ఎస్సీ మహిళ: 27, 30, 53
ఎస్సీ జనరల్: 4, 20, 25, 29
బీసీ మహిళ: 1, 5, 17, 33, 35, 43, 45, 47, 48, 54, 62, 64
బీసీ జనరల్: 10, 14, 31, 32, 34, 36, 37, 39, 46, 58, 59, 61, 63
జనరల్ మహిళ: 3, 7, 9, 11, 12, 13, 15,19, 38, 40, 41, 44, 49, 52, 55, 56, 57, 60
జనరల్: 2, 6, 8, 16, 18, 21, 22, 23, 24, 26, 42, 50, 51, 65, 66


