News July 13, 2024

90 శాతం రాయితీతో పశువుల షెడ్ల నిర్మాణం: అచ్చెన్నాయుడు

image

AP: ఉపాధి హామీ పథకంలో భాగంగా పశుపోషకులకు రాయితీపై పశువుల షెడ్లు నిర్మిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గేదెలు, ఆవుల షెడ్లకు 90 శాతం రాయితీపై గరిష్ఠంగా రూ.2.30 లక్షలు, గొర్రెలు, మేకల షెడ్లకు 70 శాతం రాయితీపై గరిష్ఠంగా రూ.2.30 లక్షలు ఇస్తామని వెల్లడించారు. కోళ్ల పెంపకందారులకు 70 శాతం రాయితీపై రూ.1.32 లక్షలు అందజేస్తామన్నారు. త్వరలోనే అన్ని జిల్లాల్లో ఈ పథకం అమలు చేస్తామని చెప్పారు.

Similar News

News April 2, 2026

ఒళ్లంతా సిందూరం.. ఇదే హనుమ కథ

image

హనుమంతుడు ఒళ్లంతా సిందూరం పూసుకొని ఉండటం వెనుక ఓ ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. సీతమ్మ తన నుదుటన సిందూరం ధరించడం వెనుకున్న విశేషాన్ని హనుమ అడిగారట. శ్రీరాముడి ఆయురారోగ్యాల కోసమని ఆమె చెప్పడంతో.. తన ప్రభువుకి మరింత మేలు జరుగుతుందని ఆంజనేయుడు దానిని తన శరీరం అంతటా పూసుకుంటాడు. ఆయన అమాయకత్వంతో కూడిన భక్తికి ముగ్ధుడైన రాముడు.. సిందూరంతో హనుమను పూజించే భక్తులకు అన్ని కష్టాలు తొలగుతాయని వరం ఇచ్చారు.

News April 2, 2026

హనుమాన్: భక్తుడే కాదు.. గొప్ప రక్షకుడు కూడా!

image

హనుమంతుడు శ్రీరాముడి పరమ భక్తుడే కాదు. ఆపదల్లో ఆదుకునే రక్షకుడు కూడా. అందుకు కురుక్షేత్రంలోని ఈ ఘటనే నిదర్శనం. యుద్ధంలో అర్జునుడి రథంపై హనుమాన్ ఉంటాడన్న విషయం తెలిసిందే. అయితే ఆ యుద్ధం ముగిశాక అర్జునుడు రథం దిగిన వెంటనే అది బూడిదైంది. శత్రువులు వేసిన అస్త్రాల శక్తిని కృష్ణుడితో పాటు హనుమంతుడు కూడా తన దివ్యశక్తితో ఆపి, అర్జునుడిని కాపాడాడు. అందుకే హనుమంతుడిని ఆపద్బాంధవుడు అంటారు.

News April 2, 2026

హనుమంతుడికి 5 ముఖాలు ఎలా వచ్చాయి?

image

రామరావణ యుద్ధంలో మైరావణుడు రామలక్ష్మణులను అపహరించి పాతాళంలో బంధిస్తాడు. అతడిని అంతం చేయాలంటే 5 దీపాలు ఒకేసారి ఆర్పాలి. అందుకే హనుమాన్ పంచముఖ రూపం ధరించి, ఆ దీపాలను ఆర్పి మైరావణుడిని వధించాడు. దుష్టశిక్షణ కోసం ఉద్భవించిన ఈ మహోగ్ర రూపం భక్తులకు సర్వ శుభాలను చేకూరుస్తుందని నమ్మకం. పంచముఖ హనుమత్ స్తోత్రం జపించి, ఆయనను పూజిస్తే దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.