News July 13, 2024
కృష్ణా: వర్షాలతో హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెట్ట పంటలకు తోడు మాగాణి పంటల సాగుకు, వరి నారుమళ్లు పోయటానికి రైతులు సిద్దమవుతున్న తరుణంలో వర్షాల రాక ఊరట కలిగించిందని రైతులు చెబుతున్నారు. సీజన్ ఆరంభంలో కురిసే ఈ వానలతో విత్తనాలు మొలకెత్తి పంటలు ఏపుగా పెరిగి దిగుబడి ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంటుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 11, 2026
మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి మృతి

కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు బుధవారం హైదరాబాదులో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన ఆయన 1984,1989,1998లో మచిలీపట్నం నుంచి, 2004, 2009లో ఏలూరు నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2013లో కేంద్ర జౌళి శాఖ మంత్రిగా సేవలందించారు. ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కావూరి మరణంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
News March 10, 2026
కృష్ణా: ‘పుర’లో ప్రత్యేక పాలన

స్థానిక సంస్థలైన నగర పాలక సంస్థ, పురపాలక సంఘం, నగర పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 17తో ముగియనుంది. దీంతో ప్రత్యేక అధికారుల పాలనకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్నికలు జరిగే వరకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 18 నుంచి ప్రత్యేక అధికారులు అధికారం చేపట్టనున్నారు. మచిలీపట్నం కార్పొరేషన్‌కు కలెక్టర్, పెడన మున్సిపాల్టీకి RDO, పెడనకు MUDA VC ప్రత్యేక అధికారులుగా వ్యవహరించనున్నారు.
News March 10, 2026
చల్లపల్లిలో బాలిక ఆత్మహత్య

చల్లపల్లి(M) నారాయణరావునగర్‌లో విషాద ఘటన సోమవారం చోటుచేసుకుంది. 10 ఏళ్ల బాలిక కడుపునొప్పితో స్కూలుకు వెళ్లకపోవడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురై ఉరేసుకుంది. గమనించిన తల్లి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై చల్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


