News July 13, 2024
ఇన్‌స్టాలో భార్య పోస్ట్.. డ్రగ్ డీలర్‌ను పట్టించింది!
అంతర్జాతీయ డ్రగ్ డీలర్‌ను పట్టుకునేందుకు పోలీసులు టెక్నాలజీని వాడారు. రెండేళ్లుగా పరారీలో ఉన్న 50ఏళ్ల బ్రెజిలియన్ డ్రగ్ లార్డ్ రోనాల్డ్ రోలాండ్‌ను ఇన్‌స్టా పోస్ట్‌లోని లొకేషన్ ఆధారంగా పట్టుకున్నారు. తన భార్యతో కలిసి పారిస్, దుబాయ్, మాల్దీవుల్లో అతడు పర్యటించారు. అయితే వారున్న ప్రదేశాన్ని అతని భార్య ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అతణ్ని బ్రెజిల్‌లోని గ్వరూజ బీచ్ సిటీలో ఫెడరల్ పోలీసులు అరెస్టు చేశారు.
Similar News
News January 20, 2025
J&K ఎన్‌కౌంటర్: భారత జవాన్ వీరమరణం
J&Kలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత ఆర్మీ జవాన్ పంగల కార్తీక్ వీరమరణం పొందారు. నార్త్ కశ్మీర్‌లోని జలూరా సోపోరాలో ఇవాళ ఇస్లామిస్ట్ తీవ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో కార్తీక్ తీవ్రగాయాలపాలవడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మరికొందరు జవాన్లకు గాయాలైనట్లు తెలుస్తోంది.
News January 20, 2025
ట్రంప్ మంచి మాట చెప్పావ్: పుతిన్
మూడో ప్రపంచ యుద్ధం రాకుండా నిలువరిస్తానన్న డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ మద్దతిచ్చారు. ‘ట్రంప్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నా. రష్యాతో నేరుగా సంబంధాలు పెట్టుకుంటానని ట్రంప్ చెప్పడం మంచిదే. అమెరికా కొత్త పాలకవర్గంతో చర్చలు జరుపుతాం’ అని పుతిన్ వ్యాఖ్యానించారు. కాగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో పాటు పశ్చిమాసియాలో యుద్ధాలను ఆపుతానని ట్రంప్ నిన్న చెప్పారు.
News January 20, 2025
బన్నీ రికార్డును బ్రేక్ చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’!
విక్టరీ వెంకటేశ్- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా రికార్డులను తిరగరాస్తోంది. సంక్రాంతి బరిలో 6 రోజుల్లోనే రూ.180+ కోట్లు కలెక్ట్ చేసి అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచినట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇప్పటివరకూ ఈ రికార్డు అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురంలో’పై(వారంలో రూ.180 కోట్లు) ఉండేది. వెంకీ చిత్రం కోసం ఫ్యామిలీలు క్యూ కడుతుండటంతో కలెక్షన్లు భారీగా వస్తున్నాయి.