News July 13, 2024
BREAKING: పాకిస్థాన్‌తో మ్యాచ్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్ ఫైనల్లో టీమ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచులో పాకిస్థాన్ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. ఆ జట్టు ఓవర్లన్నీ ఆడి 156/6కే పరిమితమైంది. షోయబ్ మాలిక్ (41) రాణించారు. కమ్రాన్ అక్మల్ (24), మక్సూద్ (21) ఫరవాలేదనిపించారు. భారత బౌలర్లలో అనురీత్ సింగ్ 3 వికెట్లు పడగొట్టారు. వినయ్ కుమార్, పవన్ నేగి, ఇర్ఫాన్ పఠాన్ తలో వికెట్ తీశారు.
Similar News
News April 1, 2026
‘పోలవరం’ అకౌంట్లోకి డబ్బులు

AP: పోలవరం ప్రాజెక్టుకు రూ.1,301.61కోట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ కుల్దీప్ కుమార్ సింగ్ రాష్ట్రానికి లేఖ రాశారు. ఆ డబ్బులు ప్రాజెక్ట్ అకౌంట్లో నేరుగా జమవుతాయని జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. డ్యామ్ పనులు, నిర్వాసితుల పరిహారం కోసం రూ.1,508కోట్లు మంజూరు చేయాలని ఇటీవల రాష్ట్ర జలవనరులశాఖ కేంద్రాన్ని కోరింది. సమీక్షించి తాజాగా నిధులు రిలీజ్ చేసింది.
News April 1, 2026
భారీగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర

ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. 19కేజీల సిలిండర్‌పై రూ.195.50 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. గతనెల దీనిపై రూ.115 పెంచిన విషయం తెలిసిందే. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశంలో ఎల్పీజీ కొరత ఏర్పడటంతో ధర పెరుగుతోంది.
News April 1, 2026
రేషన్ కార్డులు ఉన్నవారికి భారీ శుభవార్త

దేశవ్యాప్తంగా నేటి నుంచి రేషన్ షాపుల్లో ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి బియ్యం, ఇతర వస్తువులు పంపిణీ చేస్తారు. ఎండల తీవ్రత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కో లబ్ధిదారుడికి మొత్తం 18 కేజీల బియ్యం ఇస్తారు. అంత్యోదయ కార్డులు ఉన్నవారికి నెలకు 35 కేజీల చొప్పున 105 కిలోల రేషన్ అందుతుంది. గత వర్షాకాలంలోనూ ఒకేసారి మూడు నెలలకు సరిపడా రేషన్‌ను పంపిణీ చేశారు.


