News July 13, 2024
సన్యాసినిగా మారిన రోహిత్ శర్మ మాజీ గర్ల్ ఫ్రెండ్?

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ రూమర్ గర్ల్ ఫ్రెండ్ సోఫియా హయత్ సన్యాసినిగా మారారు. భౌతిక ఆనందాల కంటే ఆధ్యాత్మిక మార్గమే ఉత్తమమని ఆమె ఈ మార్గం ఎంచుకున్నారు. 2012 నుంచి మూడేళ్లపాటు రోహిత్, సోఫియా ప్రేమాయణం నడిపినట్లు టాక్. 2015లో వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ తర్వాత రోహిత్.. రితికాను, సోఫియా.. వ్లాద్ స్టానెస్కూను పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లైన ఏడాదికే సోఫియా విడాకులు తీసుకున్నారు.
Similar News
News January 20, 2026
షుగర్ పేషంట్లకు ‘తీపి’ వార్త!

తీపి అంటే ఇష్టం ఉన్నా ఆరోగ్య సమస్యల వల్ల దూరంగా ఉండేవారికి శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ చెప్పారు. సూక్రోస్‌లోని 92% తియ్యదనం, అందులో 1/3 వంతే క్యాలరీలు ఉన్న ‘తగటోస్’(Tagatose) అనే కొత్త రకం షుగర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇది శరీరంలో ఇన్సులిన్ స్థాయులను పెంచదు. దీనివల్ల బరువు పెరుగుతామన్న భయం లేకుండా డయాబెటిస్ ఉన్నవారూ మధుర రుచిని ఆస్వాదించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
News January 20, 2026
NIT వరంగల్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News January 20, 2026
పెండింగ్ చలాన్ల కోసం బలవంతం చేయొద్దు: హైకోర్టు

TG: చలాన్ల వసూలుపై ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ చలాన్ల కోసం బలవంతం చేయొద్దని, బైక్ కీస్ లాక్కోవడం, బండిని సీజ్ చేయడం లాంటివి చేయొద్దని పోలీసులను ఆదేశించింది. వాహనదారుడు స్వచ్ఛందంగా చెల్లిస్తేనే వసూలు చేయాలని సూచించింది. లేకుంటే నోటీసులు ఇవ్వాలని తెలిపింది. న్యాయవాది విజయ్ గోపాల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది.


