News July 14, 2024
చింతపల్లి ADSP కిషోర్‌కు ఏలూరు SPగా పదోన్నతి
చింతపల్లి అదనపు ఎస్పీ కెపిఎస్.కిషోర్‌కు పదోన్నతి కల్పిస్తూ ఏలూరు ఎస్పీగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. చింతపల్లిలో మొదట ఏఎస్పీగా, తర్వాత అదనపు ఎస్పీగా రెండున్నర ఏళ్లపాటు చేశారు. కిషోర్ హయాంలో చింతపల్లి పరిసర నిరుద్యోగ యువతకు అనేక ఉపాధి అవకాశాల కోసం ప్రేరణ పేరుతో జాబ్ మేళాలు నిర్వహించారు. మావోయిస్టు కార్యకలాపాలు అణిచివేతలో కీలకంగా పాల్గొన్నారు.
Similar News
News December 21, 2024
విశాఖలో వర్షం.. మ్యాచ్ రద్దు
విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్లో భాగంగా శనివారం విశాఖలో జరగాల్సిన ఛత్తీస్‌గఢ్, మిజోరం మ్యాచ్ రద్దు చేశారు. ఈ మేరకు ఉదయం 9 గంటలకు జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా మధ్యాహ్నం 12 గంటలకు రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విజయ్ హజారే ట్రోఫీలో మొదటి మ్యాచ్ ఇదే కావడం గమనార్హం.
News December 21, 2024
మీరు పడే తపన కన్నీళ్లు తెప్పిస్తోంది: పవన్ కళ్యాణ్
అనంతగిరి మండలం బల్లగరువులో రోడ్డు నిర్మాణ పనుల శంకుస్థాపన అనంతరం Dy.CM పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కాస్త ఇబ్బంది పడ్డారు. వెంటనే అక్కడున్న ప్రజలు నీళ్లు తాగాలని సూచించగా.. ‘మా ఇంట్లో వాళ్లు నా కోసం ఎంత తపన పడతారో తెలీదు కానీ.. మీరు పడే తపన కన్నీళ్లు తెప్పిస్తోంది’ అని అన్నారు. ఐదేళ్లు మీకోసం పని చేస్తానని.. ఈ ఐదేళ్ల తర్వాత ప్రోగ్రస్ రిపోర్ట్ ఇవ్వాలని గిరిజనులకు ఆయన కోరారు.
News December 21, 2024
జగన్ పుట్టినరోజు.. గుడివాడ రక్తదానం
విశాఖలో జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నగరంలోని వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కేక్ కట్ చేసి జగన్ మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన రక్తదానం చేశారు. కార్యక్రమంలో నగర మేయర్ హరి వెంకటకుమారి, రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఉన్నారు.