News July 14, 2024

ఈనెల 16న ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి రెండో పాట

image

రామ్ హీరోగా నటిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి ఈనెల 16న రెండో పాట విడుదల కానుంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ మూవీ టీమ్ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. ‘మార్ ముంత చోడ్ చింత’ అంటూ ఈ పాట సాగనుంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లలో విడుదల కానుంది. కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘స్టెప్‌మార్’ సాంగ్ యూత్‌ను ఆకట్టుకుంది.

Similar News

News February 3, 2026

మామోగ్రామ్ ఎప్పుడు చేయించుకోవాలంటే..

image

మామోగ్రఫీ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ ని గుర్తించే పరీక్ష. ఛాతీలో ఏమైనా మార్పులు, చనుమోనల తీరు మారినా, రొమ్ములో వాపు, నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే ఖచ్చితంగా మామోగ్రఫీ చేయించుకోవాలి. 40 ఏళ్లు పైబడిన ప్రతి మహిళ రెండేళ్లకు ఒకసారి మామోగ్రామ్ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇది సకాలంలో క్యాన్సర్‌ను గుర్తించడంలో సహాయపడుతుంది. సకాలంలో గుర్తించగలిగితే ప్రాణనష్టాన్ని నివారించే అవకాశాలు పెరుగుతాయి.

News February 3, 2026

నీలమణి రత్నం ధరిస్తున్నారా?

image

నవరత్నాలలో శక్తివంతమైనది నీలమణి. ఇది శనిదేవునికి సంకేతం. దీన్ని ధరిస్తే ఐశ్వర్యం, ఆనందం సిద్ధిస్తాయి. అయితే ఈ రత్నపు ఉంగరం ధరించిన వారు మద్యం తీసుకోరాదు. దీన్ని పదేపదే తీయరాదు. అలా చేస్తే దాని ప్రభావం తగ్గిపోతుంది. ఒకరు పూజించి ధరించిన నీలమణిని మరొకరు ధరించకూడదు. అలాగే ఈ రత్నం ధరిస్తే సోమరితనం వీడాలి. ఇతరులకు హాని చేయకూడదు. దయతో ప్రవర్తించాలి. లేనిపక్షంలో శనిదేవుడు ఆగ్రహానికి గురవుతాడని నమ్మకం.

News February 3, 2026

అమరావతికి చట్ట, న్యాయ రక్షణ ఉండాలి: SA రిపోర్టు

image

AP: అమరావతి రాజధానికి చట్ట, న్యాయ రక్షణ ఉండాలని తాజాగా విడుదలైన సోషల్ ఆడిట్ రిపోర్టు స్పష్టం చేసింది. ‘ఇంత పెద్ద స్కేల్ ప్రాజెక్టుపై రాజకీయాలు లేదా ఇతర ప్రభావాలు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే అది స్థానికుల జీవనోపాధిపై దుష్ప్రభావం చూపుతుంది. వారి జీవితాలను దెబ్బతీస్తుంది’ అని పేర్కొంది. రైతుల ప్లాట్లను అభివృద్ధి చేయాలంది. రోజువారీ కూలీపై ఆధారపడి ఉన్న భూమిలేని వారిని ఆదుకోవాలని సూచించింది.