News July 14, 2024

నేడు తెరుచుకోనున్న పూరీ రత్న భాండాగారం

image

ఒడిశాలోని పూరీ జగన్నాథ్ రత్నభాండాగారాన్ని 46ఏళ్ల తర్వాత ఇవాళ తెరవనున్నారు. జస్టిస్ బిశ్వనాథ్‌రథ్ కమిటీ నిర్ణయం మేరకు భాండాగారంలోని సంపదను లెక్కించనున్నారు. లెక్కింపులో ఎంత మంది పాల్గొంటారు? ఎన్ని రోజులు పడుతుంది? అనే వివరాలను అధికారులు వెల్లడించలేదు. ప్రస్తుతం పూరీలో రథయాత్ర జరుగుతోంది. ఈనెల 19 వరకు దేవతా మూర్తులు ఆలయం బయటే ఉండనున్నాయి. ఈ కారణంగానే లెక్కింపు వివరాల్ని వెల్లడించనట్లు తెలుస్తోంది.

Similar News

News January 14, 2026

సంక్రాంతి: నల్ల నువ్వులతో ఈ పరిహారాలు పాటిస్తే?

image

సంక్రాంతి నాడు నల్ల నువ్వుల దానం సిరిసంపదలను ప్రసాదిస్తుందని జ్యోతిషులు చెబుతున్నారు. రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే పితృదేవతలు శాంతించి, వంశాభివృద్ధి కలుగుతుందని సూచిస్తున్నారు. ‘దీనివల్ల శని దోషాలు కూడా తొలగి ప్రశాంతత లభిస్తుంది. నువ్వులను ఆహారంగా తీసుకోవడం వల్ల చలికాలపు అనారోగ్యాల నుంచి రక్షణ లభిస్తుంది’ అని వివరిస్తున్నారు. మరిన్ని సంక్రాంతి విశేషాల కోసం క్లిక్ <<-se_10013>>భక్తి<<>>.

News January 14, 2026

వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్

image

AP: రహదారి ప్రమాదాల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సొంత వాహనాల లైఫ్ ట్యాక్స్‌పై 10 శాతం రహదారి భద్రతా సెస్ వసూలు చేసేందుకు ఆర్డినెన్స్ జారీ చేసింది. ‘ఏపీ మోటార్ వాహన పన్ను చట్టం-1963’ సవరణకు మంత్రివర్గం, గవర్నర్ ఆమోదం లభించింది. ఇకపై వాహనం కొనుగోలు సమయంలో లైఫ్ ట్యాక్స్‌కు అదనంగా సెస్ చెల్లించాలి. ఈ నిధులను రోడ్ల మరమ్మతులు, బ్లాక్ స్పాట్స్ తొలగింపునకు వినియోగించనున్నారు.

News January 14, 2026

సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వాయిదా

image

ఇవాళ విడుదల కావాల్సిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ 2026 నోటిఫికేషన్‌ను <>UPSC<<>> వాయిదా వేసింది. అడ్మినిస్ట్రేషన్ కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏటా సివిల్ సర్వీసు ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://upsc.gov.in