News July 14, 2024
ధర్మల్ ఉద్యమ అమరుల 14వ సంస్మరణ సభ

పర్యావరణ పరిరక్షణకు ప్రజలే నాయకులై ముందుండి నడిపించిన సోంపేట ధర్మల్ పోరాటం దేశంలోనే ప్రజా ఉద్యమాల్లో ఒకటిగా పేరుపొందింది. కార్పొరేట్ల ధనదాహానికి పచ్చని బీల ప్రాంతం కనుమరుగు కావడమే కాకుండా పరిసర ప్రాంత ప్రజల జీవనం అస్తవ్యస్తమవుతుందన్న భయాందోళన నేపథ్యంలో ప్రజలే ముందుండి విజయవంతం చేసిన ఉద్యమంగా సోంపేట ధర్మల్ ఉద్యమం ఖ్యాతికెక్కింది. ధర్మల్ పోరాటంలో మృతుల జ్ఞాపకార్థం జులై 14న ఏటా సభను నిర్వహిస్తారు.
Similar News
News September 16, 2025
ఇచ్ఛాపురం: అతిథి అధ్యాపక పోస్ట్‌కు దరఖాస్తులు ఆహ్వానం

ఇచ్ఛాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒడియా అతిథి అధ్యాపక పోస్ట్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస రావు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 20వ తేదీ లోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. సెప్టెంబర్ 22న ఉదయం 10 గం.లకు ఇంటర్వ్యూ ఉంటుందని, MA (ఒడియా)లో 50% మార్కులు, NET, Ph.D అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు.
News September 16, 2025
సిక్కోలు జిల్లాలో డీఎస్సీకి ఎంతమంది ఎంపికయ్యారంటే ?

శ్రీకాకుళం జిల్లాలో డీఎస్సీ-2025లో ఎంపికైన జాబితాను తాజాగా విద్యాశాఖ వెల్లడించింది. జిల్లాలో 543 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించగా 535 మంది ఎంపికయ్యారు. ఇందులో ఎస్ఏ-391, ఎస్జీటీ-144 మంది ఎంపికయ్యారని అధికారులు వెల్లడించారు. ఎంపికైన వారికి ఈనెల 19న విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా నియామకపత్రాలు అందించనున్నారు.
News September 16, 2025
శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్‌కు 55 అర్జీలు

పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలు పునరావృతమవకుండా పూర్తి స్థాయిలో విచారణ చేసి శాశ్వత పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఆదేశించారు. సోమవారం జిల్లా SP కార్యాలయంలో ఎస్పీ గ్రీవెన్స్ నిర్వహించారు. అర్జీల్లో పౌర సంబంధాలు, కుటుంబ, ఆస్తి గొడవలు, మోసపూరితమైనవి ఇతరత్రా అంశాలపై మొత్తం 55 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ వెల్లడించారు.