News July 14, 2024

చివరిసారి పూరీ రత్నభాండాగారాన్ని ఎప్పుడు తెరిచారంటే?

image

ఒడిశాలోని పూరీ ఆలయ రత్నభాండాగారం నేడు తెరుచుకోనుంది. 1978లో ఈ గదిని తెరిచి చివరిసారిగా అందులోని సంపదను లెక్కించారు. 70 రోజుల పాటు సాగిన ఈ ప్రక్రియలో రెండు గదుల్లో రాళ్లు పొదిగిన 128.380 కేజీల బరువైన 454 బంగారు ఆభరణాలు, 221.530 కిలోల వెండి వస్తువులు ఉన్నాయని ఆడిట్‌లో తెలిపారు. ఆ తర్వాత 1982, 1985లో లోపలి గదిని తెరిచినా లెక్కలు నిర్వహించలేదు. 2018లో తెరవాలని ప్రయత్నించినా వీలు కాలేదు.

Similar News

News September 18, 2025

ఇకపై మరింత సులభంగా EPFO సేవలు

image

EPFO <>వెబ్‌సైట్‌లో<<>> పాస్‌బుక్ కోసం ప్రత్యేకంగా లాగిన్ అయ్యే అవసరాన్ని సంస్థ తగ్గించింది. ఇకపై మెంబర్ పోర్టల్‌లోనే పీఎఫ్ లావాదేవీలను చెక్ చేసుకునేలా పాస్‌బుక్ లైట్ పేరిట కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. దీనివల్ల సింగిల్ లాగిన్‌తోనే అన్ని వివరాలు చెక్ చేసుకోవచ్చు. అటు ఉద్యోగి పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్‌ కూడా పోర్టల్‌లో పీడీఎఫ్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉండనుంది.

News September 18, 2025

నాడు మండలి రద్దుకు తీర్మానం.. నేడు అదే కీలకమని వ్యాఖ్యలు!

image

AP: బిల్లులను అడ్డుకుంటోందంటూ శాసనమండలి రద్దుకు నాటి జగన్ ప్రభుత్వం తీర్మానించి తర్వాత వెనక్కి తీసుకుంది. నేడు అదే మండలిపై జగన్ చేసిన <<17752308>>వ్యాఖ్యలు<<>> వైరలవుతున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్ష‌హోదా ఇవ్వట్లేదని, మండలి సభ్యులే బలంగా పోరాడాలని అన్నారు. మండలి చాలా కీలకమని వ్యాఖ్యానించారు. అయితే అధికారంలో ఒకలా, ఇప్పుడు మరోలా మాట్లాడటం చర్చనీయాంశమవుతోంది.

News September 18, 2025

విధ్వంసం.. 13 బంతుల్లో హాఫ్ సెంచరీ

image

ఇంటర్నేషనల్ టీ20ల్లో నమీబియా ఓపెనర్ ఫ్రైలింక్ విధ్వంసం సృష్టించారు. జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20లో కేవలం 13 బంతుల్లోనే అర్ధసెంచరీ చేశారు. ఆకాశమే హద్దుగా చెలరేగిన అతడు మొత్తం 31 బంతుల్లో 77 రన్స్ చేసి ఔట్ అయ్యారు. 6 సిక్సర్లు, 8 ఫోర్లు బాదారు. ఫ్రైలింక్ బాదుడుతో నమీబియా 20 ఓవర్లలో 204/7 రన్స్ చేసింది. ఛేజింగ్‌లో జింబాబ్వే ఎదురొడ్డుతోంది.