News July 14, 2024
తెల్లవారితే నూతన గృహప్రవేశం.. ఇంతలోనే విషాదం

అనంతపురం జిల్లా <<13625175>>విషాద<<>> ఘటనలో మరో అంశం వెలుగులోకి వచ్చింది. విడపనకల్లు మండలం హవళిగి గ్రామంలో ఇంటి పై కప్పు కూలిపోవడంతో ఇంట్లో నిద్రిస్తున్న దంపతులిద్దరూ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే వారు ఇవాళ కొత్త ఇంటి గృహ ప్రవేశం చేయాలని నిర్ణయించుకున్నారట. ఇందుకోసం ముహూర్తం సైతం పెట్టుకున్నారు. ఇంతలోనే విధి వక్రీకరించడంతో రాత్రి కురిసిన వర్షానికి ఇంటి పైకప్పు కూలి నిద్రలోనే తుది శ్వాస విడిచారు.
Similar News
News July 8, 2025
మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలి: కలెక్టర్

పాఠశాలలో ఈనెల 10న జరగనున్న మెగా పేరంట్, టీచర్స్ మీటింగ్ 2.0 కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని అధికారులను అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుంచి మండల విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మీటింగ్లో తల్లితండ్రులను భాగస్వాములను చేయాలన్నారు. పాఠశాలల అభివృద్ధి గురించి వివరించాలన్నారు.
News July 7, 2025
రాయదుర్గంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

రాయదుర్గంలోని గ్యాస్ గోడౌన్ ఏరియాలో నివాసముంటున్న చాంద్బాషా ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల మేరకు.. బాషా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ జీవితంపై విరక్తి చెంది రైలు పట్టాల మీద కూర్చున్నాడు. ఈ క్రమంలో రైలు ఢీ కొట్టింది. గమనించిన లోకోపైలట్ సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని రాయదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు.
News July 7, 2025
అనంతలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో గాయపడి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తిప్పే స్వామి (52) సోమవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బెళుగుప్ప మండలం ఎర్రగుడికి చెందిన తిప్పేస్వామి ఆదివారం కణేకల్లు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని కుటుంబ సభ్యులు అనంతపురం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.