News July 14, 2024
ఆర్మూర్: ఆస్తి వివాదంలో అన్న ప్రాణం తీసిన తమ్ముడు

అన్నదమ్ముల మధ్య తలెత్తిన ఆస్తి వివాదాల్లో అన్న ప్రాణం తీసిన ఘటన ఆర్మూర్ మండలంలో జరిగింది. మామిడిపల్లికి చెందిన నర్సయ్య, గంగాధర్ అన్నదమ్ములు వీరి మధ్య శుక్రవారం ప్లాట్ల విషయంలో గొడవ జరగగా ఆగ్రహంతో గంగాధర్ నర్సయ్యపై కర్రతో దాడి చేశాడు. క్షతగాత్రుడిని కుటుంబీకులు జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న నర్సయ్య శనివారం మృతి చెందాడు. కుటుంబీకులు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.
Similar News
News January 13, 2026
NZB: బెట్టింగ్ భూతం.. తీసింది ప్రాణం

ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనం ఓ యువకుడి ప్రాణం తీసింది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కూనెపల్లికి చెందిన పెరుమండ్ల సంజయ్(28) గత కొంతకాలంగా బెట్టింగ్‌లకు బానిసై భారీగా అప్పులు చేశాడు. వాటిని తీర్చలేక, అదనపు డబ్బు కోసం తల్లిదండ్రులను వేధించేవాడు. ఉన్నకాస్తా పోవడంతో మనస్తాపానికి గురైన సంజయ్.. మంగళవారం ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. చేతికి అందిన కొడుకు మృతితో ఆ కుటుంబంలో విషాదం నిండింది.
News January 13, 2026
నిజామాబాద్: వారికి కలెక్టర్ హెచ్చరిక

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణికి డుమ్మా కొట్టిన అధికారులపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నాటి కార్యక్రమానికి గైర్హాజరైన వారికి మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. మొదటి తప్పుగా భావించి మెమోలిస్తున్నామని, పునరావృతమైతే వేతనాల్లో కోతతో పాటు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి అధికారులు బాధ్యతగా పనిచేయాలని స్పష్టం చేశారు.
News January 13, 2026
NZB: మున్సిపోల్.. మహిళా ఓటర్లే అధికం

మున్సిపల్ ఎన్నికల తుది ఓటరు జాబితాను అధికారులు విడుదల చేశారు. NZB కార్పొరేషన్‌లో మొత్తం ఓటర్లు 3,48,051 మంది ఉండగా.. మహిళలు 1,80,546, పురుషులు 1,67,461,
బోధన్‌లో మొత్తం ఓటర్లు 69,417 మంది కాగా మహిళలు 35,720, పురుషులు 33,696,
భీమ్‌గల్‌లో మొత్తం 14,045 మంది ఓటర్లు ఉండగా మహిళలు 7,429, పురుషులు 6,616,
ఆర్మూర్‌లో మొత్తం ఓటర్లు 63,972 మంది ఉండగా మహిళలు 33,322, పురుషులు 30,648, ఇతరులు ఇద్దరు ఉన్నారు.


