News July 14, 2024
పూరీ రత్నభాండాగారం విశేషాలివే..

ఒడిశాలోని పూరీ జగన్నాథుడి ఆలయ సమీపంలో రత్నభాండాగారం చిన్న ఆలయ తరహాలో ఉంటుంది. ఇందులో ఆభరణాలను భద్రపరిచేందుకు బహరా భాండార్(బయట గది), భితరా భాండార్(లోపలి గది) అనే రెండు గదులు ఉంటాయి. స్వామివారికి ఉపయోగించే ఆభరణాలు బయట గదిలో, ఒడిశాను పాలించిన రాజులు, నేపాల్ పాలకులు ఈ ఆలయానికి విరాళంగా అందజేసిన బంగారు, వెండి, వజ్రాలను లోపలి గదిలో భద్రపరిచారు.
Similar News
News January 22, 2026
నైనీ కోల్ బ్లాక్ అంశం.. కేంద్ర బృందం విచారణ

TG: రాష్ట్రంలో సంచలనంగా మారిన నైనీ కోల్ బ్లాక్ అంశంపై కేంద్రం దృష్టిసారించినట్లు తెలుస్తోంది. బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలతో కేంద్ర బృందం విచారణ జరపనుంది. ఇద్దరు సభ్యుల బృందం త్వరలోనే సింగరేణిలో పర్యటించనుంది. ఈ బృందం సింగరేణి అధికారులతో కలిసి విచారణ చేపట్టనుంది. నైనీ కోల్ బ్లాక్ టెండర్ల అంశంలో ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టిన విషయం తెలిసిందే.
News January 22, 2026
రాజధాని నిర్మాణంలో భారీ దోపిడీ: జగన్

AP: తమ వారి సంస్థలకు కారుచౌకగా భూములు కేటాయిస్తూ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని YS జగన్ మీడియా సమావేశంలో ఆరోపించారు. ‘రాజధానిలో నిర్మాణ వ్యయాన్ని దారుణంగా పెంచారు. ఒక్కో Sftకి ₹13 వేల వరకు చెల్లిస్తున్నారు. Sftకి ₹5 వేలతో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించొచ్చు. ఇక్కడ అంతకన్నా ఎక్కువ ఇస్తూ దోపిడీ చేస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. బెల్టు షాపుల్లో మద్యం అక్రమ అమ్మకాలతో దోచుకుంటున్నారని దుయ్యబట్టారు.
News January 22, 2026
కొత్త జిల్లాల ఎత్తివేత ప్రచారంపై భట్టి క్లారిటీ

TG: కొత్త జిల్లాలను ఎత్తివేస్తారనే ప్రచారానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెరదించారు. అదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. అసలు జిల్లాల రద్దు ప్రస్తావన, అలాంటి ఆలోచన కూడా లేదని కుండ బద్దలుకొట్టారు. ఇక సింగరేణి వివాదంపైనా భట్టి స్పందించారు. సంస్థ ఆస్తులు దోపిడీకి గురికాకుండా కాపాడతామని స్పష్టం చేశారు. దీనిపై పూర్తి వివరాలతో రేపు మాట్లాడతానని వెల్లడించారు.


