News July 14, 2024
ఇది నా డ్రీమ్ రోల్ లాంటిది: నభా నటేశ్

‘డార్లింగ్’ మూవీలో స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్న పాత్రని చేయడం సవాలుగా అనిపించిందని హీరోయిన్ నభా నటేశ్ అన్నారు. ఇది తన డ్రీమ్ రోల్ లాంటిదని చెప్పారు. ప్రియదర్శితో కలిసి వర్క్ చేయడం బాగుందని తెలిపారు. ఆయన కామెడీ టైమింగ్ నేచురుల్‌గా ఉంటుందని ప్రశంసించారు. అశ్విన్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఈ నెల 19న థియేటర్లలో విడుదల కానుంది.
Similar News
News January 24, 2026
సహజ కాన్పుతో సమస్యలు వస్తాయా?

నార్మల్ డెలివరీ అయినా మహిళల్లో కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. డెలివరీ తర్వాత యోని పుండ్లు పడటం, ఇన్ఫెక్షన్లు రావడం, గర్భాశయ వ్యాధి, మూత్ర విసర్జన సమస్యలు వస్తాయి. కొందరికి నార్మల్ డెలివరీలో కుట్లు వేస్తారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కొన్నిసార్లు కుట్లు విడిపోయే ప్రమాదం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి సహజ కాన్పు తర్వాత కూడా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
News January 24, 2026
రథ సప్తమి రోజున ‘7’ అంకె ప్రాముఖ్యత

ప్రకృతిలో 7 అంకెకు ఎంతో ప్రాధాన్యముంది. సప్త స్వరాలు, వారాలు, రుషులు, 7 కొండలే కాకుండా సూర్యుడి తొలి 7 కిరణాలు కూడా అంతే ముఖ్యమైనవి. అవి: సుషుమ్న, హరికేశ, విశ్వకర్మ, విశ్వశ్రవ, సంపద్వసు, అర్వాగ్వసు, స్వరాణ్. ఈ ఏడు కిరణాలు ఏడు రంగులకు (VIBGYOR) మూలమని చెబుతారు. ఇవి విశ్వమంతా శక్తిని, ఆరోగ్యాన్ని నింపుతాయని శాస్త్ర వచనం. సూర్యుని రథానికి ఉండే ఏడు గుర్రాలు కూడా ఈ కిరణాలలోని అద్భుత శక్తికి సంకేతాలే.
News January 24, 2026
600 అప్రెంటిస్ పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు స్థానిక భాషపై పట్టున్న వారు అప్లై చేసుకోవచ్చు. వయసు 20-28ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. మెరిట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bankofmaharashtra.bank.in/careers


