News July 14, 2024

ఆధారాలు లేకుండా జగన్‌పై అక్రమ కేసు పెట్టడం సరికాదు: రెడ్యం

image

మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ఎటువంటి ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా అక్రమ కేసు పెట్టడం సరికాదని వైసీపీ నాయకుడు, ఏపీఎస్ ఆర్టీసీ మాజీ జోనల్ ఛైర్మన్ రెడ్యం వెంకట సుబ్బారెడ్డి అన్నారు. ఖాజీపేట మండలం దుంపలగట్టులోని తన కార్యాలయంలో ఆయన శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్యే రఘురామక్రిష్ణమరాజుపై పోలీసుల దాడి వాస్తవం కాదని వైద్యపరీక్షల నివేదిక నిగ్గు తేల్చినా అక్రమ కేసు పెట్టడం సరికాదన్నారు.

Similar News

News December 29, 2025

మారనున్న కడప జిల్లా స్వరూపం

image

రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కడప జిల్లా స్వరూపం మారనుంది. ప్రస్తుతం 36 మండలాలుగా ఉన్న జిల్లా 40 మండలాలుగా మారనుంది. కొత్తగా అన్నమయ్య జిల్లాలోని రాజంపేట, టి.సుండుపల్లి, వీరబల్లి, నందలూరు మండలాలతో రాజంపేట నియోజకవర్గాన్ని కడప జిల్లాలోని విలీనం చేశారు.

News December 29, 2025

ఒంటిమిట్ట కోదండరాముడు మనకే..!

image

రాష్ట్రంలో జిల్లాల విభజనలో భాగంగా కొన్ని రోజులుగా ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలను అన్నమయ్యనా లేక కడప జిల్లాలో కొనసాగించాలా అన్న సందిగ్ధతకు సోమవారం పులిస్టాప్ పడింది. సోమవారం రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఎట్టకేలకు రాజంపేట నియోజకవర్గాన్ని కడప జిల్లాలో విలీనం చేస్తూ ఆమోదం తెలిపింది. దీంతో శ్రీ కోదండరామాలయం ఉన్న ఒంటిమిట్ట మండలం కడప జిల్లాలో కొనసాగుతుండడంపై జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News December 29, 2025

కడప: 2025లో రైతులకు కష్టాలు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు

image

మరో 2 రోజుల్లో 2025కు వీడ్కోలు చెప్పి 2026కు ఆహ్వానం పలుకుతాం.. అయితే ఈ ఏడాది మిర్చి, ఉల్లి పంటలకు సరైన గిట్టుబాటు ధరలేక జిల్లా రైతులు ఇబ్బందులు పడ్డారు. అంతే కాకుండా అకాల వర్షాలతో రైతన్నను మరింత ఊబిలోకి దింపింది. ఈ ఏడాది ఉమ్మడి కడప జిల్లా నుంచి 680 మంది టీచర్లుగా.. 323 మంది కానిస్టేబుళ్లుగా ఎంపిక కావడంతో వారి కుటుంబసభ్యులు సంతోషంగా ఉన్నారు. మరి ఈ ఏడాది సంతోషపెట్టిన, బాధపెట్టిన విషయాలేంటో కామెంట్.