News July 14, 2024

పక్కా ప్లాన్‌తోనే ట్రంప్‌పై దాడి!

image

పక్కా ప్లాన్ ప్రకారమే డొనాల్డ్ ట్రంప్‌పై నిందితుడు దాడి చేసినట్లు తెలుస్తోంది. దాడికి ముందే ఓ ఇంటి పైకప్పుపై నక్కి ఉన్నాడు. దూరం నుంచే టార్గెట్‌ను ఛేదించేందుకు సెమీ ఆటోమేటిక్ రైఫిల్‌ను ఉపయోగించాడు. నిందితుడి వయసు 20 ఏళ్లని, బట్లర్ సిటీకి చెందినవాడని పోలీసులు గుర్తించారు. అతడు ఉపయోగించిన రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ట్రంప్‌ను కాల్చిన మరుక్షణంలోనే నిందితుడిని సీక్రెట్ సర్వీస్ అంతమొందించింది.

Similar News

News January 9, 2026

కాటన్ యూనివర్సిటీలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

గువాహటిలోని <>కాటన్ <<>>యూనివర్సిటీ 18 ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గలవారు JAN 21వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MSc (ఆర్గానిక్, ఇన్‌ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, బోటనీ, జువాలజీ, Environ. బయాలజీ, Biotech, మాలిక్యులార్ బయాలజీ, బయో కెమిస్ట్రీ), MCA/MTech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. https://cottonuniversity.ac.in

News January 9, 2026

SBIలో 1,146 జాబ్స్.. ఒక్కరోజే ఛాన్స్

image

SBIలో 1,146 ఉద్యోగాలకు(కాంట్రాక్ట్) దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. ఇందులో VP వెల్త్(SRM) 582, AVP వెల్త్(RM) 237, కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 327 ఉన్నాయి. అభ్యర్థులకు డిగ్రీతో పాటు అనుభవం ఉండాలి. పోస్టును బట్టి 20-42ఏళ్ల వయసు ఉండాలి. జీతం VP వెల్త్‌కి ₹44.70L, AVP వెల్త్‌కి ₹30.20L, CREకి ₹6.20L వార్షిక జీతం చెల్లిస్తారు.
వెబ్‌సైట్: https://sbi.bank.in/

News January 9, 2026

జుట్టుకు రంగేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

తెల్లజుట్టును దాయడానికే కాకుండా ఫ్యాషన్ కోసం కూడా జుట్టుకు రంగువేసేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ సమయంలో కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ముందు జుట్టు ఆరోగ్యంగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. రఫ్, డ్రైగా ఉన్న జుట్టుకు రంగువేసినా సరిగ్గా అంటదు. ఎవరో చేశారని కాకుండా మీకు ఏ రంగు నప్పుతుందో చూసుకొని అదే వేసుకోవాలి. కలర్ వేసే ముందు హెయిర్‌లైన్ చుట్టూ వాజిలైన్ రాయాలి. చేతులకు గ్లోవ్స్ ధరించాలి.