News July 14, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాత వివరాలు
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. అత్యధికంగా వనపర్తి జిల్లా గోపాల్ పేటలో 25.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. గద్వాల జిల్లా ద్యాగదొడ్డి 12.8 మి.మీ, నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి 5.3 మి.మీ, నారాయణపేట జిల్లా చిన్నజట్రం 4.5 మి.మీ, మహబూబ్నగర్ జిల్లా అడ్డాకులలో 4.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
Similar News
News January 10, 2025
నేటి నుంచి హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్
మహబూబ్ నగర్ పట్టణంలోని DSA స్టేడియం గ్రౌండ్‌లో నేటి నుంచి ఈ నెల 14 వరకు అండర్-17 హ్యాండ్ బాల్ జాతీయస్థాయి బాల, బాలికల ఛాంపియన్ షిప్ నిర్వహించనున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు SGF అధికారులు తెలిపారు. ఈ టోర్నీలో మొత్తం 1550 మంది క్రీడాకారులు హాజరవుతుండగా.. బాలికలు-36, బాలురు-35 రాష్ట్రాల నుంచి తరలిరానున్నారు. ఉదయం,రాత్రి సమయాల్లో పోటీలు నిర్వహించనున్నారు.
News January 10, 2025
MBNR: సంక్రాంతికి 320 బస్సులు
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 10 ఆర్టీసీ డిపోల పరిధిలో ఈ నెల 8 నుంచి 13 వరకు హైదరాబాద్‌కు 320 బస్సులు అదనంగా నడపనున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో రద్దీని తట్టుకునేందుకు అదనపు బస్సులు నడుపుతున్నామని రీజినల్ మేనేజర్ సంతోష్ కుమార్ తెలిపారు. ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించవద్దని ఆర్టీసీ బస్సుల్లోనే సురక్షితంగా ప్రయాణించాలని కోరారు.
News January 10, 2025
16న జైపాల్ రెడ్డి జయంతికి ఏర్పాట్లు
ఈ నెల 16న జైపాల్ రెడ్డి 83వ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో జైపాల్ రెడ్డి మెమోరియల్ స్ఫూర్తి స్థల్ వద్ద జయంతిని నిర్వహించేందుకు నిర్ణయించారు. జైపాల్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లా మాడుగులలో 1942 జనవరి 16న జన్మించారు.1998లో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎంపికయ్యారు.