News July 14, 2024
ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘ఆడుజీవితం’

సినీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ఆడుజీవితం(ది గోట్ లైఫ్)’ ఎట్టకేలకు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఈ మూవీ జులై 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. సుమారు 4 నెలల కిందట థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద రూ.160 కోట్లు కొల్లగొట్టింది. 2008లో అత్యధికంగా అమ్ముడైన మలయాళ నవల ‘గోట్ డేస్’ ఆధారంగా డైరెక్టర్ బ్లెస్సీ ఈ మూవీని తెరకెక్కించారు.
Similar News
News February 4, 2026
2007-2026.. బ్రెండన్ టేలర్ సరికొత్త చరిత్ర

రానున్న T20WCలో జింబాబ్వే క్రికెటర్ బ్రెండన్ టేలర్ సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. మొట్టమొదటి T20WC(2007)లో ఆడిన టేలర్ 2026లోనూ ఐసీసీ ఈవెంట్‌లో పాల్గొంటున్న తొలి క్రికెటర్‌గా నిలవనున్నారు. టేలర్ 2015లో రిటైరై మళ్లీ 2017 నుంచి రెగ్యులర్‌గా క్రికెట్ ఆడుతున్నారు. ఈయన 58 T20Iలో 1,185 రన్స్, 207 వన్డేలలో 6,704 పరుగులు చేశారు. 2004లో క్రికెట్‌లోకి అడుగుపెట్టి 22 ఏళ్లుగా ఆడుతుండటం విశేషం.
News February 4, 2026
ఇంజినీరింగ్ అర్హతతో 379 పోస్టులు

ఇండియన్ ఆర్మీ 379 ఆఫీసర్ పోస్టులను 67వ షార్ట్ సర్వీస్ కమిషన్(టెక్నికల్) కోర్సు ద్వారా భర్తీ చేయనుంది. BE, BTech అర్హతగల మహిళలు FEB 4వరకు, పురుషులు FEB 5వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 20-27ఏళ్ల మధ్య ఉండాలి. షార్ట్ లిస్టింగ్, SSB, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. పే స్కేల్ రూ.56,100-రూ.1,77,500. వెబ్‌సైట్: https://joinindianarmy.nic.in/ *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News February 4, 2026
4KM సముద్రంలో ఈది కుటుంబాన్ని రక్షించిన 13 ఏళ్ల బాలుడు!

ఆస్ట్రేలియాకు చెందిన ఆస్టిన్ అపెల్బీ అనే 13 ఏళ్ల బాలుడు తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు ప్రాణాలకు తెగించాడు. సముద్రంలో 4 గంటలు ఈదాడు. పెడల్ బోటింగ్ చేస్తూ సముద్రంలో చిక్కుకున్న తల్లి, తోబుట్టువులను రక్షించేందుకు 4KM ఈది ఒడ్డుకు చేరుకొని అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో 14KM దూరంలో కొట్టుకుపోయిన వారందరినీ రెస్క్యూ టీమ్ సురక్షితంగా రక్షించింది. లైఫ్ జాకెట్లు ధరించడంతో వారు సురక్షితంగా ఉండగలిగారు.


