News July 14, 2024
ఉద్యోగాలు ఇచ్చేవరకూ రేవంత్‌ను వదలం: కేటీఆర్

TG: రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేవరకూ సీఎం రేవంత్ రెడ్డిని వదలమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. కానీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. రేవంత్, రాహుల్ మాత్రమే ఉద్యోగం తెచ్చుకున్నారు. గ్రూప్స్, డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలి. రాష్ట్రంలోని నిరుద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది’ అని ఆయన భరోసా ఇచ్చారు.
Similar News
News January 9, 2026
ఆసిఫాబాద్‌లో మున్సిపల్ అభ్యర్థుల వేట

జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లోని 50 వార్డులకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేశాయి. రిజర్వేషన్లు ఖరారు కాకముందే ఆశావహుల బలాబలాలపై రహస్య సర్వేలు నిర్వహిస్తున్నాయి. బీసీ, జనరల్ రిజర్వేషన్లను దృష్టిలో ఉంచుకుని కులాల వారీగా ఒక్కో వార్డు నుంచి ఇద్దరు అభ్యర్థుల పేర్లను సేకరిస్తున్నాయి. సామాజిక సమీకరణాలే గెలుపు గుర్రాలుగా భావిస్తూ అడుగులు వేస్తున్నాయి.
News January 9, 2026
సంక్రాంతికి ఫ్రీ టోల్ లేనట్లే!

సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై టోల్ మినహాయింపు ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. పండుగ రోజుల్లో ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో జనవరి 9 నుంచి 18 వరకు టోల్ ఫ్రీగా ప్రకటించాలని TG మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, TDP ఎంపీ సానా సతీశ్ బాబు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరారు. అయితే ఈ హైవేపై ఉచిత టోల్‌కు అనుమతి ఇవ్వలేమని కేంద్రం తెలియజేసినట్లు సమాచారం.
News January 9, 2026
విమానాల తయారీలోకి అదానీ గ్రూప్

అదానీ గ్రూప్ విమానాల తయారీ రంగంలోకి అడుగు పెట్టనుంది. బ్రెజిల్‌కు చెందిన ఏరోస్పేస్ దిగ్గజం ఎంబ్రాయర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లో రీజనల్ ప్యాసింజర్ జెట్ విమానాల తయారీకి అవసరమైన ఫైనల్ అసెంబ్లీ లైన్ (FAL) ఏర్పాటు చేయనున్నారు. ఫిక్స్‌డ్ వింగ్ ప్యాసింజర్ విమానాల తయారీకి సంబంధించి దేశంలో ఇదే తొలి అసెంబ్లింగ్ యూనిట్ కానుంది. ఈ నెలాఖరున జరిగే ఏవియేషన్ షోలో పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.


