News July 14, 2024
VIRAL: జగన్నాథుడే ట్రంప్‌ను రక్షించాడు

US మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను పూరీ జగన్నాథుడే రక్షించారని పలువురు పోస్టులు చేస్తున్నారు. దీంతో ఇదే నిజమని కోల్‌కతా ఇస్కాన్ VP రాధారమణ్ దాస్ ట్వీట్ చేశారు. 48 ఏళ్ల క్రితం న్యూయార్క్‌లో రథయాత్ర వేడుకల నిర్వహణకు అవసరమైన రథాలను తన భూమిలోనే నిర్మించుకునేందుకు ట్రంప్ అనుమతిచ్చారని గుర్తు చేశారు. ఆ తర్వాత యాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వడంతో సాఫీగా సాగిందన్నారు.
Similar News
News September 15, 2025
ప్రియుడితో కలిసి భర్త చెవులు కోసేసిన భార్య

TG: ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్త చెవులు కోసేసిన ఘటన మహబూబాబాద్(D)లో జరిగింది. మహబూబాబాద్ మండలం గడ్డిగూడెం తండాకు చెందిన మహిళకు గంగారం(M) మర్రిగూడేనికి చెందిన అనిల్‌తో వివాహేతర సంబంధం ఉంది. ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు ప్లాన్ చేసింది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి అతడి చెవులు కోసేయగా ప్రాణ భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశాడు. అనంతరం పారిపోయేందుకు యత్నించిన ప్రియుడిని స్థానికులు పట్టుకొని చితకబాదారు.
News September 15, 2025
రాష్ట్రానికి అదనంగా 40వేల MT యూరియా

TG: రాష్ట్రానికి మరో 40వేల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఈ వారంలో రాష్ట్రానికి 80వేల MT సరఫరా కానుంది. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం సాగులో ఉన్న వరి, మొక్కజొన్న, పత్తికి యూరియా ఎంతో అవసరం. ఈ పంటలకు రానున్న 15 రోజులు చాలా కీలకం. అందుకే రైతుల అవసరాలకు తగ్గట్టుగా యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని <<17720342>>కోరాం<<>>’ అని వెల్లడించారు.
News September 15, 2025
MBBS అడ్మిషన్స్.. మెరిట్ లిస్ట్ రిలీజ్

TG: MBBS కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి అభ్యర్థుల ఫైనల్ మెరిట్ లిస్ట్‌ను కాళోజీ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసింది. ఇక్కడ <