News July 14, 2024
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ

టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించారు. ఓ T20 సిరీస్‌లో సెంచరీతోపాటు వికెట్ సాధించిన తొలి భారత ఆటగాడిగా అభిషేక్ రికార్డు నెలకొల్పారు. ఇప్పటివరకు భారత్ నుంచి మరే క్రికెటర్ కూడా ఈ ఫీట్ సాధించలేదు. కాగా జింబాబ్వేతో జరిగిన నాలుగో టీ20లో అభిషేక్‌కు బ్యాటింగ్ రాలేదు. బౌలింగ్‌లో మాత్రం 3 ఓవర్ వేసి 20 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టారు.
Similar News
News October 29, 2025
APPLY NOW: ICMRలో ఉద్యోగాలు

ICMR-న్యూఢిల్లీ 8 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. MBBS/MD/MS/PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు నవంబర్ 17 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.1500. SC/ST/PWBD/EWS/మహిళలకు ఫీజు లేదు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.icmr.gov.in/
News October 29, 2025
గొర్రె, మేక పిల్లల పెంపకం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

గొర్రె, మేక పిల్లలు పుట్టాక వారం వరకు రైతులు జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లి నుంచి సరిపడా పాలు అందుతున్నాయా? లేదా? గమనించాలి. ఇది వాటి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వెటర్నరీ డాక్టరు సూచన మేరకు దాణా అందించాలి. రెండు నుంచి ఐదు నెలల వరకు జొన్నలను దాణాగా ఇవ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన మొక్కజొన్నలను పెట్టాలి. విటమిన్స్, కాల్షియం దాణాలో తగినంత ఉండేలా చూడాలి. పిల్లలకు 3 నెలల వయసులో డీవార్మింగ్ ప్రారంభించాలి.
News October 29, 2025
పెరిగిన బంగారం, వెండి ధరలు!

గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు ఇవాళ కాస్త పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రా.ల బంగారం ధర రూ.760 పెరిగి రూ.1,21,580కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రా.ల పసిడి ధర రూ.700 ఎగబాకి రూ.1,11,450గా ఉంది. అటు కేజీ వెండిపై రూ.1,000 పెరిగి రూ.1,66,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


