News July 14, 2024

భారత్ బ్యాటింగ్.. టీమ్ ఇదే

image

భారత్‌తో ఐదో టీ20లో టాస్ గెలిచిన జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఇప్పటికే 3-1 తేడాతో టీమ్ ఇండియా సిరీస్ కైవసం చేసుకున్న విజయం తెలిసిందే.
IND:గిల్, జైస్వాల్, అభిషేక్, శాంసన్, పరాగ్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, దేశ్‌పాండే, ముకేశ్
ZIM: వెస్లీ, తడివానాషే, బెన్నెట్, డియోన్, సికందర్, జొనాథన్, ఫరాజ్, క్లైవ్ మదాండే, బ్రాండన్, రిచర్డ్, బ్లెస్సింగ్

Similar News

News September 17, 2025

కాసేపట్లో యూఏఈతో మ్యాచ్.. హోటల్‌లోనే పాక్ ఆటగాళ్లు

image

ఆసియా కప్‌లో భారత్‌తో హ్యాండ్ షేక్ వివాదం నేపథ్యంలో పాకిస్థాన్ హర్ట్ అయిన విషయం తెలిసిందే. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని డిమాండ్ చేసింది. లేదంటే ఇవాళ యూఏఈతో మ్యాచ్ ఆడబోమని చెప్పింది. ఈక్రమంలోనే రా.8 గంటలకు యూఏఈతో మ్యాచ్ జరగాల్సి ఉండగా, పాక్ ఆటగాళ్లు హోటల్ రూమ్‌లోనే ఉండిపోయారు. మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

News September 17, 2025

మైథాలజీ క్విజ్ – 8 సమాధానాలు

image

1. మైథిలి అంటే ‘సీతాదేవి’. మిథిలా నగరానికి రాజైన జనకుడి పుత్రిక కాబట్టి ఆమెను మైథిలి అని పిలుస్తారు.
2. కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల ప్రధాన సైన్యాధిపతి ‘ధృష్టద్యుమ్నుడు’. ఆయన ద్రౌపదికి సోదరుడు.
3. ‘పూతన’ అనే రాక్షసిని చంపింది శ్రీకృష్ణుడు.
4. విష్ణువు శయనించే పాము పేరు ‘ఆది శేషుడు’. ఈ సర్పానికి ‘అనంత’ అనే పేరు కూడా ఉంది.
5. బృహదీశ్వర ఆలయం తమిళనాడులోని తంజావూరు నగరంలో ఉంది. <<-se>>#mythologyquiz<<>>

News September 17, 2025

రేపు భారీ వర్షాలు

image

AP: రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని APSDMA తెలిపింది. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతిలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వానలు పడతాయని పేర్కొంది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది.