News July 14, 2024

చంద్రబాబుతో భేటీపై మహారాష్ట్ర సీఎం ట్వీట్

image

AP: ముంబై పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. తాజా రాజకీయ పరిస్థితులు, పలు రంగాల్లో పరస్పర సహకారం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పలు ఆర్థిక అంశాలపై చర్చించినట్లు సమాచారం. తాజాగా ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను CM ఏక్‌నాథ్ Xలో షేర్ చేశారు. ఇరు రాష్ట్రాలు పరస్పర సహకారం ద్వారా అభివృద్ధిని ఎలా సాధించవచ్చనే అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు పేర్కొన్నారు.

Similar News

News November 12, 2025

IT కారిడార్లకు త్వరలో స్కైవాక్‌లు, మోనో రైలు!

image

TG: IT కారిడార్లలోని లాస్ట్ మైల్ కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మోనో రైలుకు అనుసంధానించేలా స్కైవాక్‌లు నిర్మించాలని యోచిస్తోంది. దీనికి కమర్షియల్ బిల్డింగ్ ఓనర్స్ పర్మిషన్ తప్పనిసరి. స్కైవాక్‌లను CSR ఫండ్స్ ద్వారా, మోనో రైలును PPP మోడల్‌లో నిర్మిస్తారు. త్వరలోనే CM రేవంత్ నుంచి దీనికి ఆమోదం వచ్చే అవకాశం ఉందని ఉన్నతాధికారులు Way2Newsకు తెలిపారు.

News November 12, 2025

మదనపల్లి కిడ్నీ రాకెట్.. నిందితులపై కేసు

image

APలో సంచలనం సృష్టించిన మదనపల్లి కిడ్నీ రాకెట్ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్లోబల్ ఆసుపత్రి యజమాని డా.ఆంజనేయులు, మరో వైద్యుడితో పాటు బ్రోకర్లు పద్మ, సత్యలపై మానవ అవయవాల అక్రమ రవాణా కేసు ఫైల్ చేశారు. యమున అనే మహిళ మిస్సింగ్ కేసుతో కిడ్నీ రాకెట్ బయటపడింది. పద్మ, సత్య డబ్బు ఆశ చూపి అమాయకులను కిడ్నీ మార్పిడి దందాలోకి దింపుతున్నారు. యమునను కూడా తీసుకొచ్చి కిడ్నీ తొలగిస్తుండగా మరణించింది.

News November 12, 2025

సికింద్రాబాద్‌లోని NIEPMDలో ఉద్యోగాలు

image

సికింద్రాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజేబిలిటీస్ (<>NIEPMD<<>>) 13 కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 17న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి ఇంటర్, డిప్లొమా, బీటెక్/PG ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.200. రాత పరీక్ష/స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.niepid.nic.in