News July 14, 2024
ఆగస్టు నెలాఖరుకు పూర్తిస్థాయిలో U-win పోర్టల్

గర్భిణులు, పిల్లల టీకాల పంపిణీ నమోదు కోసం ఆగస్టు నెలాఖరుకు U-win పోర్టల్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో డిప్తీరియా, మీజిల్స్, రూబెల్లా తదితర వ్యాధులను ఎదుర్కొనేందుకు అందించే టీకాల వివరాలను ఇందులో పొందుపరుస్తారు. దీనివల్ల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను సులభంగా పొందొచ్చు. ఇప్పటికే బెంగాల్ మినహా అన్ని రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నారు.
Similar News
News April 10, 2026
ఆర్టీసీలో ట్రైనీ ఫలితాలు విడుదల

TGSRTCలో ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ(TST), మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ(MST) పోస్టుల ఫలితాలను TSLPRB రిలీజ్ చేసింది. TST పోస్టులకు 9,377 మంది, MST జాబ్స్‌కు 2,755మంది అర్హత సాధించినట్లు తెలిపింది. ఈ నెల 16, 17 తేదీల్లో 1:5 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొంది. అభ్యర్థులు HYD అంబర్‌పేట్ PTCలో వెరిఫికేషన్‌కు హాజరుకావాలని సూచించింది. 198 పోస్టుల భర్తీకి మార్చి 29న పరీక్షలు జరిగాయి.
News April 10, 2026
RCB Vs RR.. టాస్ ఆలస్యం

అస్సాంలోని గువాహటిలో జరగాల్సిన RCB-RR మ్యాచ్ టాస్ ఆలస్యంగా పడనుంది. స్టేడియం వద్ద వర్షం కురుస్తోంది. వాన తగ్గాక అంపైర్లు పిచ్‌ను పరిశీలించి టాస్‌పై ప్రకటన చేస్తారు. ఈ నెల 7న రాజస్థాన్-ముంబై మ్యాచ్ సందర్భంగానూ గువాహటిలో భారీ వర్షం కురవడంతో గేమ్‌ను 11 ఓవర్లకు కుదించారు. దీంతో అస్సాంలో మ్యాచులంటే ‘అస్సామే’ అని IPL ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు.
News April 10, 2026
మావిగన్‌తో మరుసటి రోజే రాజధాని: సజ్జల

AP: చంద్రబాబు లెక్క ప్రకారం అమరావతి పూర్తి కావాలంటే రూ.2-3 లక్షల కోట్లు కావాలని, అందుకు 30-40 ఏళ్లు పడుతుందని YCP రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కానీ జగన్ సూచించిన మావిగన్‌లో 10% ఖర్చుతో మరుసటి రోజే రాజధాని అవుతుందని చెప్పారు. మావిగన్ ప్రాంతం ఇప్పటికే ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్లతో ప్రపంచానికి అనుసంధానమై ఉందని, త్వరలోనే పోర్టు కూడా వస్తుందని తెలిపారు.


