News July 14, 2024
అనుమతి లేకుండా అంబానీ పెళ్లికి వెళ్లిన ఇద్దరు అరెస్ట్

అపర కుబేరుడు ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల పెళ్లికి ఆహ్వానం లేకుండా వెళ్లిన ఇద్దరిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై బాంద్రా కుర్లా కాంప్లెక్స్ PSలో కేసులు నమోదు చేశారు. వారిలో ఒకరు అల్లూరి వెంకటేశ్ నరసయ్య(26) కాగా, మరో వ్యక్తి షేక్ మహ్మద్ షఫీ(28)గా గుర్తించారు. వీరిద్దరూ ఏపీ నుంచి వచ్చినట్లు ముంబై పోలీసులు తెలిపారు. నిందితులకు నోటీసులిచ్చి ఆ తర్వాత వదిలిపెట్టారు.
Similar News
News April 1, 2026
AIIMS న్యూఢిల్లీలో 10 పోస్టులు

తాత్కాలిక ప్రాతిపదికన 10 పోస్టుల భర్తీకి ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పోస్టును బట్టి డిప్లొమా/ డిగ్రీ/MBBS/ PGతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. జీతం నెలకు రూ.18,000 – 67,000గా ఉంది. అభ్యర్థుల వయసు 25-35 మధ్య ఉండాలి. ఇంటర్వ్యూతో ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ 02.04.2026. పూర్తి వివరాలకు www.aiims.eduలో noticesలోని recruitment చూడండి.
News April 1, 2026
ఇరాన్‌పై 16వేల బాంబులు వేశాం: ఇజ్రాయెల్

యుద్ధం మొదలైనప్పటి నుంచి తమ వైమానిక దళం ఇరాన్‌పై 800కు పైగా విడతల్లో 16వేల బాంబులను జారవిడిచినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. 4వేల లక్ష్యాలపై 10వేలకు పైగా దాడులు చేసినట్లు తెలిపింది. మిలిటరీ హెడ్‌క్వార్టర్లు, అణుస్థావరాలు, మిస్సైల్ లాంచర్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. 2వేలకు పైగా కీలక నాయకులు, సైనికులు, కమాండర్లను హతమార్చినట్లు పేర్కొంది.