News July 14, 2024

నందలూరు: ఆర్టీసీ కండక్టర్‌ను వెంటాడిన మృత్యువు

image

నందలూరు మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అందరూ ప్రాణాలతో బయటపడగా కండక్టర్ రాముడు(40) మాత్రం మృతి చెందారు. ప్రమాద సమయంలో కండక్టర్ బస్సులో నుంచి బయటికి ఎగిరిపడ్డారు. తిరిగి లేచి అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో లారీలో ఉన్న ఐరన్ కాయిల్ మీద పడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు బస్సులో ఉన్న ప్రయాణికులు తెలిపారు.

Similar News

News January 10, 2026

గండికోట ఉత్సవాలకు ప్రత్యేక బస్సులు

image

గండికోట ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఈనెల 11, 12, 13న ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు RTC రీజనల్ మేనేజర్ గోపాల్‌రెడ్డి శనివారం తెలిపారు. జమ్మలమడుగు, కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు డిపోల నుంచి మొత్తం 39 బస్సులను నడుపుతున్నామన్నారు. జమ్మలమడుగు నుంచి ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఉదయం నుంచి రాత్రి 10 వరకు బస్సులు తిరుగుతాయన్నారు. ఈ సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు.

News January 10, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు..!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారు, వెండి ధరల వివరాలు.
* బంగారు 24 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.14,145
* బంగారు 22 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.13,013
* వెండి 10 గ్రాములు ధర రూ.2,540

* బంగారు 24 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.14,145
* బంగారు 22 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.13,013
* వెండి 10 గ్రాములు ధర రూ.2,540

News January 10, 2026

గండికోట ఉత్సవాలు.. హెలికాఫ్టర్ రైడ్ ధర తగ్గింపు

image

గండికోట ఉత్సవాలలో హెలికాఫ్టర్ రైడింగ్‌లో ధరల తగ్గించినట్లు కలెక్టర్ తెలిపారు. ముందుగా ఒక వ్యక్తికి రూ. 5 వేలుగా నిర్ణయించగా.. దానిని రూ.3 వేలకు తగ్గిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. 6 నిమిషాలు రైడింగ్ ఉంటుందన్నారు. గండికోట చుట్టు పక్క ప్రాంతాలు, గండికోట ప్రాజెక్టు, మైలవరం జలాశయాన్ని హెలికాఫ్టర్ ద్వారా వీక్షించే అవకాశం ఉంటుందన్నారు.