News July 14, 2024
8.5 కేజీలు తగ్గిన కేజ్రీవాల్.. ఆరోగ్యానికి పెనుముప్పు: అతీశీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైలులో ఉన్న CM కేజ్రీవాల్ ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదం పొంచి ఉందని ఆప్ మంత్రి అతీశీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన షుగర్ లెవెల్స్ 50 కంటే తక్కువకు పడిపోయాయని, బరువు 8.5KGలు తగ్గిపోయారని చెప్పారు. ‘జైలులో ఉన్న ఆప్ చీఫ్‌కు సరైన వైద్యం అందడం లేదు. ఆయన స్ట్రోక్, బ్రెయిన్ డ్యామేజీకి గురైతే ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ పరిస్థితిపై డాక్టర్లను సంప్రదిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
Similar News
News February 25, 2026
ఊరిలో సగం మంది కవలలే..!

కేరళలోని కొడిన్హి గ్రామం ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా వెయ్యి జననాల్లో కేవలం నలుగురు కవలలు పుడితే ఇక్కడ ఆ సంఖ్య ఏకంగా 45కి పైగా ఉంది. సుమారు 2,000 కుటుంబాలున్న ఆ ఊరిలో 400కు పైగా కవల జంటలు నివసిస్తున్నాయి. దీనికి గల కారణాలు తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు, డాక్టర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటికీ సరైన సమాధానం దొరకలేదు. ఇలాంటి వింతైన విషయాలు ‘వంద రోజుల్లో- వంద వింతలు’ ఎపిసోడ్‌లో..
News February 25, 2026
T20 WC: కివీస్‌తో మ్యాచ్.. లంక బౌలింగ్

న్యూజిలాండ్‌తో జరుగుతున్న కీలక మ్యాచులో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సూపర్-8లో ఇప్పటికే ఇంగ్లండ్ చేతిలో ఓడిన లంక ఈ మ్యాచులో గెలిస్తేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఓడితే ఇంటిబాట పడుతుంది. అటు పాక్‌తో మ్యాచు వర్షం కారణంగా రద్దవడంతో కివీస్‌కూ ఈ మ్యాచులో గెలవడం తప్పనిసరిగా మారింది. టీమ్స్ వివరాలు పైన ఇమేజ్‌లో చూడొచ్చు. మరి ఇవాళ ఎవరు విజయం సాధిస్తారని అనుకుంటున్నారు? COMMENT
News February 25, 2026
ఇజ్రాయెల్ ప్రతిపాదనను భారత్ అంగీకరిస్తుందా?

ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన నేపథ్యంలో ఆ దేశ ప్రధాని నెతన్యాహు అంతకుముందు ప్రతిపాదించిన ‘Hexagon of Alliances’ చర్చనీయాంశమైంది. మిడిల్ ఈస్ట్‌లో తీవ్రవాదం పోరుకు భారత్ సహా ఆరు దేశాలతో కూటమి ఏర్పాటు చేయాలనేది నెతన్యాహు ప్రపోజల్. మోదీతో భేటీలో దీనిని ప్రస్తావించే అవకాశం ఉంది. అయితే ఇది పరోక్షంగా ఇరాన్‌ను టార్గెట్ చేసే అవకాశం ఉండటంతో మిత్రదేశమైన భారత్ దీనిపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరం.


