News July 14, 2024
BIG BREAKING: సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్

TG: విద్యుత్ కమిషన్ విచారణను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీజేఐ ధర్మాసనం రేపు విచారించనుంది. ఇదే అంశంపై కేసీఆర్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంతో ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. BRS హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయంటూ రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ వేసిన విషయం తెలిసిందే.
Similar News
News January 12, 2026
తిరుపతి: లోయలో పడిపోయిన యువకుడు

హార్సిలీహిల్స్‌లో సోమవారం ఉదయం ప్రమాదం జరిగింది. పలమనేరుకు చెందిన పురుషోత్తం తిరుపతి SVUలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఫ్రెండ్స్‌తో కలిసి హార్సిలీహిల్స్‌కు వచ్చాడు. పర్యాటక అందాలను తిలకిస్తూ గాలిబండ వద్ద సెల్ఫీ తీసుకుంటుండగా కాలు జారి లోయలో పడిపోయాడు. దట్టమైన పొగ మంచు కారణంగా చాలాసేపటి తర్వాత చెట్ల మధ్యలో అతడిని గుర్తించారు. బి.కొత్తకోట సీఐ గోపాల్ రెడ్డి స్పందించి అతడిని ఆసుపత్రికి తరలించారు.
News January 12, 2026
పెట్టుబడుల డెస్టినేషన్‌గా ఏపీ: చంద్రబాబు

AP: దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25శాతం రాష్ట్రానికే వచ్చాయని మంత్రులు, అధికారుల సమావేశంలో సీఎం చంద్రబాబు తెలిపారు. దీంతో స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ల డెస్టినేషన్‌గా మారిందన్నారు. సీఐఐ ద్వారా చేసుకున్న ఒప్పందాలన్నీ సాకారం అయితే 16లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతిలో క్వాంటం వ్యాలీకి త్వరలో ఫౌండేషన్ వేయనున్నట్లు వెల్లడించారు.
News January 12, 2026
APPLY NOW: CSIR-CECRIలో ఉద్యోగాలు

<


