News July 14, 2024

కుర్రాళ్లు అదరగొట్టారు

image

సీనియర్లు లేకుండా జింబాబ్వే పర్యటనకు వెళ్లిన భారత కుర్రాళ్లు T20 సిరీస్‌ను 4-1తేడాతో చేజిక్కించుకున్నారు. తొలి T20లో తడబడినా ఆ తర్వాత పుంజుకుని ప్రత్యర్థి జట్టుపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. హార్దిక్, బుమ్రా వంటి కీలక ప్లేయర్లు లేకపోయినా గిల్ నేతృత్వంలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ప్రస్తుత జట్టులో భవిష్యత్తులో భారత్‌కు ఎవరు కీలకంగా మారుతారని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

Similar News

News January 22, 2026

నెల్లూరు: ఆక్వా రైతులకు లైసెన్స్‌ తప్పనిసరి

image

నెల్లూరు జిల్లాలో ఆక్వా రైతుకు కరెంట్ సబ్సిడీ లబ్ధికి అనుమతులు తప్పనిసరి అని మత్స్యశాఖ అధికారిని శాంతి ఓ ప్రకటనలో తెలిపారు. APSADA & CAA చట్ట నిబంధనల మేరకు ఆక్వా సాగు చేయు (మంచి నీటి & ఉప్పు నీటి వనరులలో) ప్రతి రైతు కరెంటు సబ్సిడీని పొందుటకు తప్పనిసరిగా మత్స్యశాఖ ద్వారా లైసెన్సు పొందాలన్నారు. అనుమతి పొందని వారు ఈనెల 31వ తేదీ లోగా సచివాలయం ద్వారా లైసెన్సు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News January 22, 2026

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును ICC సస్పెండ్ చేయనుందా?

image

T20 WC మ్యాచులు భారత్‌లో ఆడబోమని బంగ్లా క్రికెట్ బోర్డ్ చెప్పడాన్ని ICC సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇండియాలో ఆడాల్సిందే అని చెప్పినా వినకపోవడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు భావిస్తోంది. విచారణలో ఇదే నిజమని తేలితే BCBని సస్పెండ్ చేయాలని ఆలోచిస్తున్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెల 7న WC ప్రారంభం కానున్న నేపథ్యంలో త్వరలోనే డెసిషన్ తీసుకోనుందని అభిప్రాయపడుతున్నాయి.

News January 22, 2026

నెక్స్ట్ నోటీసులు ఇచ్చేది కేసీఆర్‌కేనా?

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. BRS కీలక నేతలకు సిట్ వరుసబెట్టి నోటీసులు ఇస్తోంది. ఈ నెల 20న హరీశ్ రావును విచారించిన అధికారులు తాజాగా KTRకూ నోటీసులిచ్చారు. రేపు విచారణకు రావాలని ఆదేశించారు. కాగా నెక్స్ట్ సిట్ నుంచి నోటీసులు వచ్చేది BRS అధినేత KCRకేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.