News July 14, 2024
ఇండియా మా దేశానికి రాకపోతే T20WC-26 నుంచి వైదొలుగుతాం: PCB

వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీని పూర్తిగా తమ దేశంలోనే నిర్వహించాలని PCB నిర్ణయించుకుంది. ఈ టోర్నీ కోసం పాకిస్థాన్‌కు టీమ్ ఇండియా రాకపోతే.. 2026లో భారత్- శ్రీలంక నిర్వహించే T20WC నుంచి వైదొలగాలని భావిస్తోంది. ఈ నెల 19 నుంచి 22 వరకు కొలంబోలో జరిగే ICC వార్షిక సదస్సులో హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదనలను వ్యతిరేకించనున్నట్లు సమాచారం. పాక్‌లో పర్యటించబోమని BCCI వర్గాలు చెబుతున్న విషయం తెలిసిందే.
Similar News
News November 11, 2025
బిహార్ ఎలక్షన్స్: ALL TIME RECORD

బిహార్ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో ఆల్ టైమ్ రికార్డు నమోదయింది. ఫేజ్-1(65.08%), ఫేజ్-2(68.76%) కలిపి ఈసారి మొత్తం 66.91% ఓట్లు పోలయ్యాయి. 1951లో తొలి ఎలక్షన్ జరిగినప్పటి నుంచి ఆ రాష్ట్రంలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. మహిళల ఓటింగ్‌లోనూ ఈసారి రికార్డు స్థాయిలో 71.6% ఓటింగ్ నమోదైంది. ఎన్నికల ఫలితాలు ఈ నెల 14న వెలువడనుండగా ఎగ్జిట్ పోల్స్ NDAకే విజయావకాశాలు ఉన్నాయని అంచనా వేశాయి..
News November 11, 2025
ఢిల్లీ బ్లాస్ట్ సూసైడ్ అటాక్ కాదా?

ఢిల్లీ బ్లాస్ట్ సూసైడ్ అటాక్ కాదని, భయాందోళనలో తొందరపడి చేసిన దాడిగా దర్యాప్తు సంస్థలు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు ANI పేర్కొంది. ‘టెర్రర్ నెట్‌వర్క్స్‌పై దాడుల నేపథ్యంలో ఆ ఒత్తిడిలో ఇలా చేసి ఉండొచ్చు. నిందితుడు రెగ్యులర్ సూసైడ్ బాంబింగ్ పాటర్న్ ఫాలో కాలేదు. ఇంటెన్షనల్‌గా దేనిని ఢీకొనలేదు. పూర్తిగా డెవలప్ కాని బాంబును వాడటంతో తీవ్రత తగ్గింది’ అని దర్యాప్తు అధికారులు భావిస్తున్నట్లు తెలిపింది.
News November 11, 2025
జూబ్లీహిల్స్‌లో BRS గెలుపు: మిషన్ చాణక్య ఎగ్జిట్ పోల్

TG: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో BRS పార్టీ గెలుస్తుందని ‘మిషన్ చాణక్య’ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. BRSకు 41.60%, కాంగ్రెస్‌కు 39.43%, BJPకి 18.97% ఓటు షేర్ వస్తుందని పేర్కొంది. షేక్‌పేట్, బోరబండ, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, సోమాజిగూడ డివిజన్లలో BRSకు, యూసుఫ్‌గూడ, రహమత్ నగర్ డివిజన్లలో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం వస్తుందని తెలిపింది.


