News July 15, 2024
ఈ-నోటీసులపై కేంద్రం హెచ్చరిక

ప్రభుత్వం పేరుతో ఈ-మెయిల్స్‌కు వచ్చే నోటీసులపై అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. నకిలీ మెయిల్స్‌పై క్లిక్ చేస్తే సైబర్ మోసాల బారిన పడే అవకాశం ఉందని తెలిపింది. ‘మెయిల్ చివర gov.in అని ఉంటే ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ అని గుర్తించాలి. అందులో పేర్కొన్న అధికారుల పేర్లు, సదరు డిపార్ట్‌మెంట్లకు ఫోన్ చేసి లేదా వెబ్‌సైట్‌కి వెళ్లి చెక్ చేసుకోవాలి’ అని కేంద్ర సైబర్ క్రైం విభాగం సూచనలు చేసింది.
Similar News
News January 13, 2026
క్రెడిట్ కార్డ్ ఎడాపెడా వాడేస్తున్నారా? IT నోటీసు రెడీ..

మీ సంపాదనకు.. క్రెడిట్ కార్డ్ ఖర్చులకు పొంతన లేకపోతే ఆదాయ పన్ను శాఖ మీపై గురి పెడుతుంది. ఫ్రెండ్స్ కోసం స్వైప్ చేయడం, రెంట్ పేమెంట్స్ పేరుతో మనీ సర్క్యులేట్ చేయడం, రివార్డ్ పాయింట్ల కోసం అనవసర ట్రాన్సాక్షన్స్ చేస్తే మీరు బుక్కైనట్టే. వాలెట్ లోడింగ్, భారీ క్యాష్ బ్యాక్ లావాదేవీలను IT నిశితంగా గమనిస్తోంది. అనుమానం వస్తే నోటీసులు పంపుతుంది. ఆధారాలు చూపలేకపోతే ఆ ఖర్చును అక్రమ ఆదాయంగా పరిగణిస్తుంది.
News January 13, 2026
జీడిమామిడిలో వచ్చిన కాయలు నిలబడాలంటే?

జీడిమామిడిలో పూత తర్వాత వచ్చిన కాయలు చిన్నగా ఉన్నప్పుడే రాలిపోతుంటాయి. చాలా తోటల్లో ఇది కనిపిస్తుంది. ఈ సమస్య తగ్గి కొత్తగా వచ్చిన కాయలు నిలబడాలంటే 19-19-19 లేదా మల్టికే(13-0-45)ను లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి కాయలు తడిచేలా పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల కాయలు మొక్కలపై నిలబడి, దిగుబడి పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
News January 13, 2026
BMRCLలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్(<


