News July 15, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News February 3, 2026
ట్రేడ్ డీల్‌పై వివాదం.. లోక్‌సభ వాయిదా

భారత్-అమెరికా ట్రేడ్ డీల్ అంశంపై కేంద్రం సమాధానం ఇవ్వాలంటూ విపక్షాలు లోక్‌సభలో తీవ్ర ఆందోళనకు దిగాయి. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విపక్ష ఎంపీలు వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. స్పీకర్ సభ్యులను శాంతింపజేయడానికి పలుమార్లు ప్రయత్నించారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లోక్‌సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.
News February 3, 2026
రెచ్చగొడుతున్నారా? ఈ టెక్నిక్స్‌తో వారికి చెక్ పెట్టేయండి!

1. సిచ్యువేషన్‌ను గమనించాలి. ‘ఇది కాసేపు మాత్రమే.. ఈ గొడవ నా క్యారెక్టర్‌ను డిసైడ్ చేయదు’ అని అనుకోవాలి.
2. 4-7-8 టెక్నిక్ ఉపయోగించాలి. ముక్కుతో 4సెకన్లు గాలి తీసుకుని 7సెకన్లు ఆపాలి. తర్వాత 8సెకన్లపాటు మెల్లగా నోటితో వదలాలి.
3. ఏ ఉద్దేశంతో రెచ్చగొట్టేలా మాట్లాడారని తెలుసుకోవాలి.
4. ‘ఓహో’, ‘సరే చూద్దాం’, ‘అవునా’ అని బోరింగ్ సమాధానాలివ్వాలి.
5. ఆ మాటల వల్లే ‘నాకు కోపం వస్తోంది’ అని అనుకోవద్దు.
News February 3, 2026
ఆర్థిక శక్తిగా భారత్: ప్రధాని నాయకత్వంపై పవన్ ప్రశంసలు

ఒకే వారంలో రెండు కీలక వాణిజ్య ఒప్పందాల వైపు అడుగులు వేసి దేశ ఆర్థిక వ్యవస్థను ప్రధాని మోదీ శక్తిమంతం చేశారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు. ప్రధాని నేతృత్వంలో యురోపియన్ యూనియన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, US టారిఫ్ ఛార్జీలను 18%కి తగ్గించే చర్యల వల్ల మార్కెట్లో పోటీతత్వం, రైతులకు ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా Xలో ప్రధానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.


