News July 15, 2024

నిందితుడి ఉద్దేశం ఏంటో ఇంకా తెలియలేదు: బైడెన్

image

ట్రంప్‌పై కాల్పులు జరపడం వెనుక <<13626052>>నిందితుడి<<>> ఉద్దేశం ఏంటో ఇంకా తెలియలేదని జో బైడెన్ వెల్లడించారు. ‘ట్రంప్‌తో మాట్లాడాను. ఆయన కోలుకుంటున్నారు. ఈ ఘటనపై FBI విచారణ జరుపుతోంది. నిందితుడి ఉద్దేశాలపై ఊహాగానాలు ప్రచారం చేయవద్దని ప్రజల్ని కోరుతున్నా. దర్యాప్తు క్షుణ్ణంగా, వేగంగా జరగాలని ఆదేశించాను’ అని తెలిపారు.

Similar News

News January 17, 2026

ఎగ్జిమ్ బ్యాంక్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>ఎక్జిమ్<<>> బ్యాంక్ ఆఫ్ ఇండియా 40 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గలవారు నేటినుంచి FEB 1 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ , PG (MBA/PGDBA/PGDBM/MMS), ఫైనాన్స్, IB, CAలో స్పెషలైజేషన్ చేసినవారు అర్హులు. వయసు 21- 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.eximbankindia.in/

News January 17, 2026

BREAKING: మేయర్ల రిజర్వేషన్లు ఖరారు

image

TG: కార్పొరేషన్ మేయర్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మహిళలకు 50% రిజర్వేషన్లు కేటాయించినట్లు మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి వెల్లడించారు.
*నిజామాబాద్- మహిళ జనరల్ *నల్గొండ- మహిళ జనరల్
*ఖమ్మం- మహిళ జనరల్ *గ్రేటర్ వరంగల్- జనరల్
*GHMC- మహిళ జనరల్ *కరీంనగర్- బీసీ జనరల్
*మంచిర్యాల- బీసీ జనరల్ *మహబూబ్‌నగర్- బీసీ మహిళ
*రామగుండం- ఎస్సీ జనరల్ *కొత్తగూడెం- ఎస్టీ జనరల్

News January 17, 2026

3 రోజుల్లోనే రూ.61.1 కోట్లు

image

నవీన్ పొలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’ సినిమా బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లోనే రూ.61.1 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 14 విడుదలైన ఈ మూవీ తొలి రోజు రూ.22 కోట్లు, రెండు రోజుల్లో రూ.41.2కోట్లు సాధించింది. మారి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటించారు.