News July 15, 2024

కృష్ణా: నేడు ఉద్యోగుల సమస్యలపై గ్రీవెన్స్ డే

image

కృష్ణా జిల్లాలో రెగ్యులర్, ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సమస్యలపై రేపు సోమవారం సాయంత్రం 4.30 గంటలకు కలెక్టరేట్లో గ్రీవెన్స్ డే నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు వారి పరిధిలోని ఉద్యోగులకు ఈ విషయం తెలియజేయాలని కలెక్టర్ సూచించారు.

Similar News

News January 21, 2026

కృష్ణా: ఏడుగురు సీనియర్ అసిస్టెంట్లకు ఏఓలుగా పదోన్నతి

image

కృష్ణా జిల్లా పరిషత్‌లో పనిచేస్తున్న ఏడుగురు సీనియర్ అసిస్టెంట్లకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా (ఏఓ) పదోన్నతి లభించింది. వీరికి సంబంధించిన నియామక ఉత్తర్వులను జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఉప్పల హారిక బుధవారం పంపిణీ చేశారు. స్థానిక జెడ్పీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. పదోన్నతి పొందిన వారు బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు.

News January 20, 2026

కృష్ణా: ‘ఇంటర్ పరీక్షలకు పకడ్బండీ ఏర్పాట్లు’

image

జిల్లాలో జరిగే ఇంటర్ పబ్లిక్ పరీక్షలను ఎలాంటి అవకతవకలు జరగకుండా కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం తన ఛాంబర్‌లో పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. మూడు దశల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. ప్రాక్టికల్ పరీక్షల కోసం 84 పరీక్షా కేంద్రాలు, వృత్తి విద్య ప్రాక్టికల్ పరీక్షల కోసం 18 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

News January 20, 2026

కృష్ణా జిల్లా కలెక్టర్‌కి అవార్డు

image

కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బెస్ట్ ఎలక్ట్రోలర్ ప్రాక్టిసెస్ అవార్డును దక్కించుకున్నారు. ఈ నెల 25వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో జరగనున్న నేషనల్ ఓటర్స్ డే కార్యక్రమంలో కలెక్టర్ డీకే బాలాజీ ఈ అవార్డును అందుకోనున్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడంతోపాటు అత్యధిక మంది కొత్త ఓటర్ల నమోదులో కలెక్టర్ చూపిన ప్రతిభకు గాను ఈ అవార్డు లభించింది.