News July 15, 2024

HYDలో వరదలు.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై BJP విమర్శలు

image

వర్షం, వరదల కారణంగా HYD వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారని టీ బీజేపీ ట్వీట్ చేసింది. గత పాలనలో జరిగిన లోపాల నుంచి నేర్చుకుని, సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించింది. ‘ఇదేనా KTR.. నీటి బుడగల మీద నువ్వు కట్టిన విశ్వనగరం? ఇదేనా రేవంత్.. ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బతుకుతున్న ప్రజలకి నువ్విచ్చే భరోసా?’ అంటూ రోడ్లపై వరద పారుతున్న వీడియోను Xలో పోస్ట్ చేసింది.

Similar News

News September 18, 2025

ఈ సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం 5 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు అక్కడ జరిగే ఇన్వెస్టర్ల సమావేశంలో పాల్గొననున్నారు. అలాగే కేంద్రమంత్రులతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉంది.

News September 18, 2025

కోళ్లలో రక్తపారుడు వ్యాధి – లక్షణాలు

image

కోళ్లలో వైరస్, సూక్ష్మజీవుల వల్ల రక్తపారుడు వ్యాధి వస్తుంది. ఇది కూడా చిన్న కోడి పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోగం వస్తే కోళ్లలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వ్యాధి బారినపడ్డ కోడి పిల్లలు ఒకేచోట గుమిగూడి రక్త విరేచనాలతో బాధపడతాయి. లక్షణాలు మరీ తీవ్రంగా మారితే కోడి పిల్లలు మరణించే అవకాశం ఉంది. వ్యాధి నివారణకు <<17696499>>లిట్టరు<<>>ను పొడిగా ఉంచాలి. వెటర్నరీ నిపుణులకు తెలిపి వారి సలహాలను పాటించాలి.

News September 18, 2025

OFFICIAL: ‘కల్కి-2’ నుంచి దీపికా పదుకొణె ఔట్

image

రెబల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి’ మూవీలో కీలక పాత్రలో నటించిన దీపికా పదుకొణె రాబోయే సీక్వెల్‌లో నటించబోరని మేకర్స్ ప్రకటించారు. ‘కల్కి-2లో దీపిక భాగం కాదని ప్రకటిస్తున్నాం. అన్నివిధాలుగా పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. కల్కిలాంటి సినిమాలో నటించే నటులకు ఎక్కువ కమిట్మెంట్ అవసరం. దీపిక తదుపరి సినిమాలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం’ అని వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది.