News July 15, 2024

బుగ్గన అవినీతిని బయట పెడతాం: నాగేశ్వరరావు

image

మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అవినీతిని బయటపెట్టి తీరుతామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు యాదవ్ హెచ్చరించారు. ఆదివారం ఆయన ప్యాపిలిలో మాట్లాడారు. బుగ్గన అధికారంలో ఉన్నప్పుడు ఆయన అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేశారన్నారు. ఇప్పుడు కూడా ఆయన అధికారంలో ఉన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని మండిపడ్డారు.

Similar News

News March 5, 2026

కర్నూలు: ఇంటర్ పరీక్షలకు 79 మంది డుమ్మా

image

కర్నూలు జిల్లాలో గురువారం ఇంటర్ ఓపెన్ స్కూల్ హిందీ, తెలుగు, ఉర్దూ పరీక్షలు జరిగాయి. 79 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యా శాఖ అధికారి ఎల్.సుధాకర్ తెలిపారు. 889మంది పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 810మంది వచ్చారు. ఫ్లయింగ్ స్క్వాడ్ 4 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసింది. డీఈవో 2 సెంటర్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.

News March 5, 2026

కర్నూలు జిల్లాకు అవార్డు రావాలి: కలెక్టర్

image

స్వచ్ఛ సర్వేక్షణ్ మార్గదర్శకాల అమలు, కార్యక్రమాల నిర్వహణపై కర్నూలు కలెక్టర్ డా.ఏ.సిరి మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో గతేడాది వచ్చిన ర్యాంక్ కంటే ఈసారి మెరుగైన ఫలితాలు సాధించాలని చెప్పారు. కచ్చితంగా జిల్లాకు అవార్డులు వచ్చేలా పనిచేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. శానిటేషన్‌లో మెరుగుపడితే అవార్డులు వస్తాయని సూచించారు.

News March 5, 2026

కర్నూలు DCCB సీఈవోగా శివలీల

image

కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(DCCB) నూతన ముఖ్య కార్యనిర్వహణాధికారి(CEO)గా కొమ్మ శివలీల నియమితులయ్యారు. ఈ మేరకు ఆమె గురువారం బాధ్యతలు స్వీకరించారు. తన నియామకానికి సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. బ్యాంకును అభివృద్ధి పథంలో నడిపించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. బ్యాంకులో మొండి బకాయిల(NPA) వసూళ్లను వేగవంతం చేసి, ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తామన్నారు.