News July 15, 2024
VIRAL: చైనాలో ట్రంప్ టీషర్టుల విక్రయం

డొనాల్డ్ ట్రంప్‌పై నిన్న కాల్పులు జరిగిన కాసేపటికే చైనాలో ఆన్‌లైన్ రిటైలర్లు ఆయన ఫొటోతో టీషర్ట్‌లు ప్రింట్ చేసి విక్రయించారు. కాల్పుల అనంతరం ట్రంప్ పిడికిలి చూపించిన ఫొటోతో పాటు దాడిలో గాయపడిన చిత్రాలను వాటిపై ముద్రించి అమ్మకానికి పెట్టారు. ఈ టీషర్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Similar News
News February 4, 2026
ఆన్‌లైన్ గేమ్స్‌తో జాగ్రత్త బాస్

ఆన్‌లైన్ గేమింగ్ మాయలో పడి ముగ్గురు అక్కాచెల్లెళ్లు <<19045678>>సూసైడ్<<>> చేసుకున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని సూసైడ్ డెస్టినేషన్ గేమ్స్ పిల్లలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. అందుకే ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ వంటి దేశాలు పిల్లలు SM వాడకుండా కఠిన నిబంధనలు తెచ్చాయి. మన దగ్గర కూడా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు ఫోన్‌లో ఏం చేస్తున్నారన్నది ఎప్పటికప్పుడు గమనిస్తూ, వారికి డిజిటల్ భద్రతపై అవగాహన కల్పించాలి.
News February 4, 2026
అభివృద్ధిని చూసి ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలి: CM

TG: ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురేలేదని, తమ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని సీఎం రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధిని చూసి ఓటేయాలని నల్గొండ జిల్లా గూడూరులో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పిలుపునిచ్చారు. ‘3.17 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నాం. సన్నబియ్యం వచ్చిన వారు కాంగ్రెస్‌కు ఓటేయాలి. RTCలో ఫ్రీగా ప్రయాణం చేస్తున్న వాళ్లంతా మాకు ఓటేస్తే BJP, BRSకు డిపాజిట్లు కూడా రావు’ అని పేర్కొన్నారు.
News February 4, 2026
ఎవరు.. ఏ కులం: స్టూడెంట్ల క్యాస్ట్ డేటాపై కసరత్తు

TG: రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో బీసీ విద్యార్థుల సమాచారాన్నిBC కమిషన్ కులాల వారీగా సేకరిస్తోంది. ఈ సమాచారం ఆధారంగా బీసీ విద్యార్థుల్లో ఏ కులం వారు ఎంత మంది ఉన్నారో లెక్కించనుంది. విద్యకు బాగా దూరంగా ఉన్న బీసీ కులాలను గుర్తించి ప్రోత్సహించనుంది. దీనిలో భాగంగా SE డైరెక్టర్ నవీన్ నికోలస్, TGSCHE సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్‌తో కమిషన్ ఇవాళ భేటీ అయింది. మొత్తం స్టూడెంట్ల డేటా వెంటనే ఇవ్వాలంది.


