News July 15, 2024

23 నుంచి ‘పొలం పిలుస్తోంది’

image

AP: ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 23 నుంచి ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. వ్యవసాయ శాఖ కమిషనర్ నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు పొలంబాట పట్టనున్నారు. వారానికి 2 రోజులపాటు రోజుకు 2 గ్రామాల చొప్పున కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందుకోసం మండలాలవారీగా షెడ్యూల్‌ను సిద్ధం చేస్తున్నారు. ఉదయం పొలాల్లో పర్యటించి, మధ్యాహ్నం రైతులతో సమావేశమవుతారు.

Similar News

News January 23, 2026

ముగిసిన దావోస్ పర్యటన.. రేపు HYDకు చంద్రబాబు

image

AP CM చంద్రబాబు దావోస్ పర్యటన ముగించుకుని స్వదేశానికి బయల్దేరారు. నాలుగు రోజుల పర్యటనలో పెట్టుబడులే లక్ష్యంగా ఆయన పలు కంపెనీల అధిపతులతో భేటీ అయ్యారు. మొత్తం 36కు పైగా సమావేశాల్లో పాల్గొన్నారు. రేపు ఉదయానికల్లా ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి అమరావతి వెళ్తారు.

News January 23, 2026

పీవీ సింధుపై సీఎంల ప్రశంసలు

image

ఇంటర్నేషనల్ కెరీర్‌లో 500 విజయాలు సాధించిన తొలి భారతీయురాలిగా ఘనత వహించిన స్టార్ షట్లర్ పీవీ సింధుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఆట పట్ల ఆమె అంకితభావం, పట్టుదలను రేవంత్ కొనియాడారు. సింధు ఘనత దేశానికి గర్వకారణమన్నారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

News January 23, 2026

రేపటి నుంచి రష్యా-ఉక్రెయిన్-అమెరికా కీలక చర్చలు

image

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు దిశగా తొలి అడుగుగా UAEలో రేపటి నుంచి త్రైపాక్షిక సమావేశం జరగనుంది. జనవరి 23, 24 తేదీల్లో ఉక్రెయిన్, అమెరికా, రష్యా ప్రతినిధులు చర్చలు జరుపుతారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ దావోస్‌లో ప్రకటించారు. ఇది మొదటి త్రైపాక్షిక భేటీ కావడం విశేషం. US అధ్యక్షుడు ట్రంప్‌తో జరిగిన భేటీ అనంతరం ఈ ప్రకటన చేశారు. రష్యా కూడా రాజీకి సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.