News July 15, 2024

HYD: PSలో హోంగార్డు హల్‌చల్

image

‘నా కొడుకునే రిమాండ్ చేస్తారా మీకెంత ధైర్యం ఉండాలి’ అంటూ ఓ హోంగార్డు PSలో హల్‌చల్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఘట్కేసర్‌కు చెందిన ఏ.వెంకటేశ్‌‌ను చైన్‌స్నాచింగ్ కేసులో పోలీసులు రిమాండ్ చేశారు. నిందితుడి తండ్రి హోంగార్డుగా పని చేస్తున్నారు. శనివారం రాత్రి స్థానిక PSలోకి వెళ్లి ఏకంగా క్రైమ్ సీఐ శ్రీనివాస్‌నే ‘నీ అంతు చూస్తా’ అంటూ ఇష్టమొచ్చినట్లు తిడుతూ రచ్చచేశారు. అతడి మీద కూడా కేసు నమోదైంది.

Similar News

News September 17, 2025

పేట్ల బురుజులో పోలీసుల శిశు సంరక్షణ కేంద్రం

image

మహిళా పోలీసుల కోసం నూతన శిశు సంరక్షణ కేంద్రాన్ని నగర పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ బుధవారం ప్రారంభించారు. పేట్లబురుజులోని సీఏఆర్ ప్రధాన కార్యాలయంలో మహిళా పోలీసు అధికారుల పిల్లల కోసం ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. 150-200 మంది పిల్లలకు ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. మహిళా ఉద్యోగులు తమ పిల్లలను డ్యూటీ ప్రదేశానికి తీసుకువస్తే వారి సంరక్షణకు ఈ కేంద్రం ఎంతో భరోసా ఇస్తుందన్నారు.

News September 17, 2025

బేగంపేట ఎయిర్‌పోర్టులో రాజ్‌నాథ్‌కు వీడ్కోలు

image

కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ హైదరాబాద్ పర్యటన ముగిసింది. పర్యటన అనంతరం తిరిగి ఢిల్లీ వెళుతున్న సందర్భంగా బేగంపేట విమానాశ్రయంలో కిషన్ రెడ్డి, రాష్ట్ర BJP అధ్యక్షుడు రామచంద్ర రావు, జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి ఆయనకు వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో DCP రష్మీ పెరుమల్, డిఫెన్స్ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

News September 17, 2025

హస్తంలో చిచ్చుపెట్టిన జూబ్లీహిల్స్

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హస్తం పార్టీలో చిచ్చు పెట్టింది. అభ్యర్థి ఎంపిక అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. పాత నేతలంతా టికెట్ కోసం హస్తిన నుంచి ఫైరవీ మొదలెట్టారు. దానం నాగేందర్‌, అంజన్ కుమార్, నవీన్ కుమార్, PJR కుమార్తె విజయారెడ్డి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడి నుంచి బీసీ నేతను పోటీకి దింపేందుకు INC నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు CM, TPCC చీఫ్ నిర్ణయమే కీలకంగా మారుతోంది.