News July 15, 2024
ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గ్రామ సభలు నిర్వహించి ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం. తొలి దశలో సొంత స్థలం ఉన్న వారికి ఆర్థికసాయం, రెండో దశలో స్థలం లేని వారికి స్థలంతో పాటు ఆర్థికసాయం అందజేయనుందట. తొలి దశలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేస్తుంది. ఇంటి నిర్మాణానికి లబ్ధిదారులకు ₹5లక్షలను 3 విడతల్లో వారి ఖాతాల్లో జమ చేయనుంది.
Similar News
News January 21, 2026
నాలుగోసారి తండ్రి కాబోతున్న JD వాన్స్

అమెరికా వైస్ ప్రెసిడెంట్ JD వాన్స్-ఉష దంపతులు మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వాన్స్ ప్రకటించారు. ‘ఉష మా నాలుగో బిడ్డకు జన్మనివ్వబోతోంది. మా బాబు జులైలో పుట్టబోతున్నాడు. ఈ సంతోష సమయంలో మా ఫ్యామిలీ, దేశం కోసం కష్టపడుతున్న సిబ్బందికి, సేవలందిస్తున్న మిలిటరీ డాక్టర్లకు ధన్యవాదాలు’ అని తెలిపారు. లా స్కూల్లో వీళ్ల మధ్య పరిచయం ఏర్పడింది. వీళ్లిద్దరూ 2014లో పెళ్లిచేసుకున్నారు.
News January 21, 2026
కివీస్ జోరుకు సూర్య కళ్లెం వేస్తారా?

నాగ్‌పూర్ వేదికగా ఇవాళ టీమ్ ఇండియా-NZ మధ్య తొలి టీ20 జరగనుంది. ఇప్పటికే ODI సిరీస్ గెలిచి కివీస్ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. స్టాట్స్ ప్రకారం ఇరు దేశాల మధ్య 8 ద్వైపాక్షిక T20 సిరీస్‌లు జరగ్గా భారత్ 5, NZ 3 గెలిచాయి. అయితే సూర్య ఫామ్ కాస్త ఆందోళన కలిగిస్తోంది. అభిషేక్, శాంసన్, ఇషాన్ మంచి స్టార్ట్ ఇస్తే గెలుపు సాధ్యమే. రా.7గం. నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో మ్యాచ్ లైవ్ చూడొచ్చు.
News January 21, 2026
పురుగు మందుల కొనుగోలు- జాగ్రత్తలు

పంటకు ఆశించినది తెగులో, పురుగో గుర్తించి.. వ్యవసాయ అధికారుల సిఫార్సు మేరకు నమ్మకమైన డీలర్ల నుంచి పురుగు మందులను కొనాలి. డీలర్ నుంచి మందు వివరాల రసీదును తప్పనిసరిగా తీసుకోవాలి. 2,3 రకాల మందులు అందుబాటులో ఉంటే విషపూరిత గుణాన్ని బట్టి తక్కువ హాని కలిగించే మందును ఎన్నుకోవాలి. ప్యాకెట్‌పై ఆ మందును ఏ పంటలో ఏ పురుగు, తెగులు కోసం సిఫార్సు చేశారో చూసి తీసుకోవాలి. ప్యాకింగ్, గడువు తేదీని తప్పక చూడాలి.


