News July 15, 2024
2030 నాటికి ₹580L cr రిటైల్ డిజిటల్ చెల్లింపులు

దేశంలో 2022లో ఇ- కామర్స్ మార్కెట్ ₹6.5L cr ఉండగా, 2030 నాటికి 21% వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని ఓ అధ్యయనం వెల్లడించింది. రిటైల్ డిజిటల్ చెల్లింపులు 2023-24లో దాదాపు ₹300L cr ఉండగా, 2030కి ₹580L crకు చేరొచ్చని తెలిపింది. 1965-1996 మధ్య జన్మించిన వారు 72% డిజిటల్ చెల్లింపులే చేస్తున్నారని పేర్కొంది. అమెజాన్ పే, కార్ని సంయుక్తంగా 120 నగరాల్లో ‘హౌ అర్బన్ ఇండియా పేస్’ పేరుతో ఈ అధ్యయనం చేసింది.
Similar News
News February 4, 2026
ఏఐ షాక్ నుంచి తేరుకుని ఫ్లాట్‌గా ముగిశాయి!

దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 78 పాయింట్ల స్వల్ప లాభంతో 83,817కు చేరగా నిఫ్టీ 48 పాయింట్లు పెరిగి 25,776 వద్ద స్థిరపడింది. ఆంత్రోపిక్ సంస్థ తెచ్చిన కొత్త AI టూల్ వల్ల ఐటీ కంపెనీల భవిష్యత్తుపై ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది. దీంతో ₹2లక్షలకోట్ల షేర్లను అమ్మేశారు. ఆ ఎఫెక్ట్ మార్కెట్లపై పడింది. TECHM -4.12%, HCL TECH -4.22%, TCS -6.95%, ఇన్ఫోసిస్ -7.19% నష్టాన్ని నమోదు చేశాయి.
News February 4, 2026
మున్సి‘పోల్స్’: బడ్జెట్ సన్నాహక భేటీ వాయిదా

TG: మంత్రులు మున్సి‘పోల్స్’లో బిజీగా ఉండడంతో బడ్జెట్ సన్నాహక సమావేశాలను ఆర్థిక శాఖ వాయిదా వేసింది. ఎన్నికల ప్రచారం కారణంగా సమావేశాలకు హాజరు కాలేమని మంత్రులు Dy CM భట్టి విక్రమార్కకు తెలిపారు. దీంతో FEB 13న ఫలితాలు వెలువడిన తరువాత భేటీలను కొనసాగించాలని ఆ శాఖ నిర్ణయించింది. కాగా FY25-26 చివరి 3 త్రైమాసికాలకు కేటాయించిన నిధులు, ఖర్చుల వివరాలను అందించాలని అన్ని శాఖల కార్యదర్శులను ఆర్థిక శాఖ కోరింది.
News February 4, 2026
క్లాడ్ కోవర్క్: పనులన్నీ చక్కబెట్టే సరికొత్త AI ఏజెంట్!

ఆంత్రోపిక్ కంపెనీ Claude Cowork పేరుతో విప్లవాత్మక AI టూల్‌ను పరిచయం చేసింది. ఇది కేవలం సమాధానాలు ఇచ్చే చాట్‌బాట్ కాదు. కంప్యూటర్‌లో ఫైళ్లను ఆర్గనైజ్ చేయడం, రిపోర్ట్‌లు రాయడం వంటి పనులను చేయగల ఒక ‘ఏజెంట్’. లీగల్, సేల్స్, మార్కెటింగ్ వంటి 11 విభాగాల కోసం ఇందులో ప్లగిన్‌లు ఉన్నాయి. ఇవి కాంట్రాక్టుల రివ్యూ, సేల్స్ డేటా అనాలిసిస్ వంటి కష్టమైన ప్రొఫెషనల్ వర్క్స్‌ను తక్కువ సమయంలో పూర్తి చేస్తుంది.


