News July 15, 2024
అనంతసాగరం ఎస్సై తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం

సోమశిల జలాశయాన్ని మంత్రులు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ బందోబస్తులో ఉన్న అనంతసాగరం SI సూర్యప్రకాశ్ ప్రజాప్రతినిధులు, విలేకరుల వాహనాలను అడ్డుకోని దురుసుగా ప్రవర్తించడం తీవ్ర చర్చనీయాంశమైంది. మంత్రులు జలాశయంపై సమావేశం నిర్వహించడంతో MLA ఇంటూరు నాగేశ్వరరావు తన కారులో వెళ్తుండగా SI కారును ఆపారు. మంత్రి నిమ్మల కారును సైతం ఆపారు. ఎస్సై దురుసు ప్రవర్తనపై పలువురు అసహనం వ్యక్తం చేశారు.
Similar News
News January 16, 2026
జిల్లాలోనే మాజీ ఉపరాష్ట్రపతి

మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పండుగ సందర్భంగా జిల్లాలోని ఆయన స్వస్థలం వెంకటాచలం మండలంలోనే ఉన్నారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. ఆయనను పలువురు ప్రముఖులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయనను శుక్రవారం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారిరువురు జిల్లా పరిస్థితుల గురించి మాట్లాడుకున్నారు.
News January 16, 2026
నెల్లూరు టీడీపీ నేత మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం

నెల్లూరు సిటీ టీడీపీ నేత, 42, 43వ క్లస్టర్ ఇంఛార్జ్ మహమ్మద్ జాకీర్ షరీఫ్ మృతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. నెల్లూరు వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో జాకీర్ గాయపడి ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. జాకీర్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి… వారి కుటుంబంలో విషాదం నెలకొనడం బాధాకరమని అన్నారు.
News January 16, 2026
BREAKING.. నెల్లూరు: బీచ్‌లో నలుగురు గల్లంతు..

అల్లూరు మండలం ఇసుకపల్లి సముద్ర తీరాన ఈతకు వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. వారిలో ఒక మృతదేహాన్ని మత్స్యకారులు గుర్తించి సముద్రపు ఒడ్డుకు తీసుకొచ్చారు. మరో ముగ్గురి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. పండుగ కావడంతో అల్లూరు పంచాయతీకి చెందిన నలుగురు యువకులు ఈతకు వెళ్లి ఆలల ఉధృతికి గల్లంతయ్యారు. ఇంటర్ చదువుతున్న విద్యార్థిని మృతదేహాన్ని మత్స్యకారులు బయటికి తీసుకొచ్చారు.


