News July 15, 2024
తిరుపతి ఎస్పీకి ఘన వీడ్కోలు

తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు కడపకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా పోలీసు అధికారులు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. పోలీసు అతిథి గృహం వద్ద ఆదివారం రాత్రి జిల్లా అధికారులు పుష్పగుచ్ఛంతో సత్కరించారు. ఆయన సేవలను కొనియాడారు. తనకు సహకరించిన వారికి ఎస్పీ కృతజ్ఞతలు చెప్పారు. అడిషనల్ ఎస్పీలు విమలాకుమారి, కులశేఖర్ పలువురు అధికారులు పాల్గొన్నారు.
Similar News
News March 3, 2026
చిత్తూరు: నేడు సెలవు

హోలీ సందర్భంగా చిత్తూరు జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు మంగళవారం సెలవు ఇస్తున్నట్లు డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఎక్కడైనా పాఠశాలలు నిర్వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అకడమిక్ క్యాలెండర్‌లో సెలవు దినంగా పేర్కొన్న బుధవారం (4వ తేదీ) సాధారణ పనిదినంగా ఉంటుందన్నారు.
News March 3, 2026
చిత్తూరు జిల్లాలో వారికి వారం రోజుల గడువు

గుర్తింపు పొందని ప్రైవేటు ఆసుపత్రులు, వివిధ క్లినిక్లకు చిత్తూరు DMHO సుధారాణి కీలక సూచనలు చేశారు. APMCE చట్టం ప్రకారం అనుమతి పొందేలా వారం రోజుల్లో దరఖాస్తులు చేసుకోవాలనన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంకా గుర్తింపు పొందని ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్‌లు, ఫిజియోథెరపీ యూనిట్లు డీఎంహెచ్‌వో వద్ద రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News March 3, 2026
చిత్తూరు పోలీసులకు 54 ఫిర్యాదులు

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. బాధితుల నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 54 ఫిర్యాదుల అందినట్టు అధికారులు వెల్లడించారు. ఇందులో నగదు లావాదేవీలు 6, ఆస్తి తగాదాలు 7, భూతగాదాలు 23 ఫిర్యాదులు ఉన్నాయి. వీటిని సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.


