News July 15, 2024
విజయనగరంలో యాక్సిడెంట్.. పిఠాపురం వాసి మృతి

విజయనగరం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పిఠాపురానికి చెందిన ఓ వ్యక్తి మృతిచెందగా ఆరుగురు గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. పిఠాపురం ప్రాంతానికి చెందిన యువకులు ఒడిశాలోని రాయగడ యాత్రకు కారులో బయలుదేరారు. ఆదివారం సాయంత్రం విజయనగరం గ్రామీణ మండల పరిధిలోని రామవరం- గుంకలాం రోడ్డులో వెళ్తుండగా ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ఘటనలో శ్రీనివాస్ మృతిచెందగా.. ఆరుగురిని జిల్లాసుపత్రికి తరలించారు. కేసు నమోదైంది.
Similar News
News December 31, 2025
నిడదవోలులో విషాదం.. పదేళ్ల బాలుడి మృతి

నిడదవోలు మండలం మునిపల్లి వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అత్తిలి భరత్ అనే బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సమిశ్రగూడెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలిస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల వేళ ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
News December 31, 2025
గోదావరిలో దూకబోయిన తల్లి, కూతురు.. కాపాడిన పోలీసులు

కొవ్వూరు గోదావరి వంతెన వద్ద ఆత్మహత్యకు యత్నించిన తల్లి, పదేళ్ల కుమార్తెను శక్తి టీం పోలీసులు బుధవారం కాపాడారు. 112 నంబర్ నుంచి అందిన సమాచారంతో తక్షణమే స్పందించిన పోలీసులు వారిని రక్షించారు. కుటుంబ కలహాల వల్లే ఈ అఘాయిత్యానికి సిద్ధపడినట్లు పట్టణ సీఐ పి.విశ్వం తెలిపారు. సకాలంలో స్పందించి ఇద్దరి ప్రాణాలు కాపాడిన పోలీసులను స్థానికులు అభినందించారు.
News December 31, 2025
కోనసీమ నుంచి తూర్పుగోదావరికి మూడు మండలాలు!

జిల్లాల పునర్విభజన చట్టం మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం డివిజన్ నుంచి మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలను తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్‌లో చేర్చుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ విషయాన్ని కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం అధికారికంగా వెల్లడించారు. తాజా మార్పులతో ఆయా ప్రాంతాల భౌగోళిక పరిధి మారనుంది.


