News July 15, 2024

సిద్దిపేట: బావపై బామ్మర్ది దాడి.. మృతి

image

బామ్మర్ది దాడిలో బావ మృతిచెందిన ఘటన మేడ్చల్‌ జిల్లాలో జరిగింది. సిద్దిపేట జిల్లా కుకునూరు మం. తిప్పాపురం గ్రామానికి చెందిన రాజు(35) దంపతులు భార్య ఫ్యామిలీతో కలిసి జవహర్‌నగర్‌‌లో ఉంటున్నారు. శనివారం రాత్రి రాజు మద్యం మత్తులో భార్య, అత్తపై చేయి చేసుకున్నాడు. దీంతో బామ్మర్ది చందు పక్కనే ఉన్న చెక్కతో తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడిన రాజును గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు.

Similar News

News January 21, 2026

మెదక్: టికెట్ల కోసం దరఖాస్తుల స్వీకరణ

image

మెదక్ పురపాలక సంఘంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. ఎమ్మెల్యే డాక్టర్ మైనపల్లి రోహిత్ రావు నిన్న చేసిన సూచన మేరకు బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 32 వార్డుల నుంచి టికెట్ ఆశిస్తూ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున దరఖాస్తులు అందజేశారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మందుగుల గంగాధర్ స్వీకరించారు. మాజీ ఛైర్మన్ చంద్రపాల్ పాల్గొన్నారు.

News January 21, 2026

మెదక్: ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడి చేయడమే ప్రజాపాలనా? హరీష్ రావు

image

అలంపూర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విజయుడిపై నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి దాడిని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. విజయుడిపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి దుర్భాషలాడుతూ చేయి చేసుకోవడం దారుణమన్నారు. అప్రజాస్వామికమని విమర్శించారు. ప్రజల చేత ఎన్నిక కాబడిన ప్రతినిధిపై దాడి అంటే ప్రజల తీర్పుపైనే దాడి అని స్పష్టం చేశారు. విజయుడిపై ఎంపీ మల్లు రవి దాడిని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.

News January 21, 2026

MDK: హత్యాయత్నం కేసులో నేరస్తుడికి ఐదేళ్ల జైలు శిక్ష

image

నర్సాపూర్ PS పరిధిలో ఇవ్వాల్సిన డబ్బులను అడిగిన వ్యక్తిపై దాడి చేసి చంపడానికి ప్రయత్నించిన వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి సుభావళి తీర్పునిచ్చినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఆటో డ్రైవర్ వడ్ల నిరంజన్ కల్లు తాగేందుకు కల్లు దుకాణం వద్దకు వెళ్లగా, అక్కడ కనిపించిన శివప్రసాద్‌ను ఇవ్వాల్సిన డబ్బులు అడగగా గొడవ జరిగింది. దీంతో కల్లు సీసా పగలగొట్టి పొడిచాడు.